ఎన్టీఆర్,హృతిక్ రోషన్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ మూవీ ‘వార్ 2’. ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘యష్ రాజ్ ఫిలింస్’ సంస్థ తమ ‘స్పై యూనివర్స్’ లో భాగంగా రూపొందించింది. ఆల్రెడీ ‘వార్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘వార్ 2’ పై అంచనాలు పెరిగాయి. పైగా ఈసారి సౌత్ మార్కెట్ ను టార్గెట్ చేసే ఉద్దేశంతో ఎన్టీఆర్ ను సెకండ్ హీరోగా పెట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో హిందీలో మాదిరే తెలుగులో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.కానీ 2వ, 3వ రోజు తగ్గాయి. 4వ రోజు మరింతగా తగ్గడం గమనార్హం. ఒకసారి ‘వార్ 2’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 9.85 cr |
సీడెడ్ | 7.59 cr |
ఉత్తరాంధ్ర | 4.85 cr |
ఈస్ట్ | 2.69 cr |
వెస్ట్ | 1.91 cr |
గుంటూరు | 3.26 cr |
కృష్ణా | 2.62 cr |
నెల్లూరు | 1.58 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 34.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3 cr |
ఓవర్సీస్ | 2.2 cr |
టోటల్ వరల్డ్ వైడ్(తెలుగు వెర్షన్) | 39.55(షేర్) |
‘వార్ 2’ చిత్రానికి (తెలుగు వెర్షన్) రూ.87.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.88 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజుల్లో ఈ చిత్రం రూ.39.55 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.73.7 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.48.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. సో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే అని చెప్పాలి. మరి వీక్ డేస్ లో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి