నటి హేమ చిన్నప్పుడే చనిపోయిందనుకున్నారట.. కానీ?

  • February 25, 2021 / 05:17 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ కమెడియన్లతో పోలిస్తే ఫిమేల్ కమెడియన్ల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే. తెలుగులో కామెడీ పాత్రలు చేయడంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు హేమ. తాజాగా అలీతో సరదాగా షోకు మరో ప్రముఖ నటి శ్రీలక్ష్మితో కలిసి హాజరైన హేమ షోలో అలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇస్తూ సినిమాల గురించి, ఇతర విషయాల గురించి చెప్పుకొచ్చారు. తనది తూర్పుగోదావరి జిల్లా రాజోలు అని.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాతే తన పేరు హేమగా మారిందని ఆమె అన్నారు. కుటుంబంలో అందరికంటే తానే చిన్నదానినని..

ఎవరైనా వెకిలి వేషాలు వేస్తే కొట్టేదానినని.. అలా కొట్టడం వల్ల చేతికి వేసిన మట్టిగాజులు పగిలిపోతూ ఉండటంతో అమ్మ ఇనుపగాజులు కొనిపెట్టిందని హేమ చెప్పారు. నందమూరి బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో తెరకెక్కిన భలేదొంగ తన తొలి సినిమా అని ఆమె తెలిపారు. భలే దొంగ సినిమాలో రావుగోపాలరావు కూతురిగా తాను నటించానని.. ఆ సినిమా తరువాత క్షణక్షణం సినిమాతో పాటు వరుసగా పది సినిమాలలో ఆఫర్లు వచ్చాయని హేమ తెలిపారు. తనకు ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఒకసారి కొయ్యలా బిగుసుకుపోవడంతో కుటుంబ సభ్యులు చనిపోయానని బయట పడుకోబెట్టారని..

అమ్మవాళ్లు ఏడుస్తూ ఉన్నారని.. నాన్న ఇంటికి వచ్చి ఆస్పత్రిలో చికిత్స చేయించడంతో కొద్దిసేపటికే గట్టిగా ఏడ్చానని అన్నారు. నాన్నకు ఇద్దరు భార్యలని తాను రెండో భార్య సంతానం అని ఆమె అన్నారు. కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాలలో నటించి తాను పెళ్లి చేసుకున్నానని.. త్రివిక్రమ్ కామెడీ ట్రై చేయమని చెప్పడంతో సెకండ్ ఇన్నింగ్స్ లో అతడు సినిమాలో అమాయకంగా కనిపించే పాత్రలో నటించానని ఆమె అన్నారు.


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus