బుల్లితెర సీరియల్స్ ద్వారా నటిగా సందడి చేస్తూ అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు నటి హిమజ. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బుల్లితెర సీరియల్స్ కు దూరమైనప్పటికీ వెండి తెరపై పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి హిమజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఎన్నో అవమానాలను పడ్డానని తెలిపారు. ఇక చాలామంది తనని బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా చేశారని ఈ సందర్భంగా అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇలా తాను ఎదుర్కొన్న అవమానాలను తలుచుకొని ఎంతగానో ఏడ్చానని, అయితే అవమానాలను చూసి తాను వెనక్కు తగ్గలేదని ఈమె తెలిపారు.
మనం చేసే పని కరెక్ట్ గా ఉంటే ఎవరికి భయపడాల్సిన పనిలేదని, పనికిరాని మాటల గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకూడదని ఈమె తెలిపారు.ఇక కెరియర్ మొదట్లో నా నడక అసలు అమ్మాయిల నడక లాగా ఉండదని మగవారి నడక లాగా ఉంటుందనీ ట్రోల్స్ చేశారు. ఇక డైరెక్టర్లు స్వయంగా నా కళ్ళు ఏ మాత్రం బాగుండవని కామెంట్లు చేశారు. ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు ఘోరంగా ఏడ్చానని ఈమె తెలిపారు.
ఇలా తన కళ్ళు బాలేవంటూ కామెంట్ చేసిన వారు మేకప్ వేసుకున్న తర్వాత తన కళ్ళే హైలైట్ అయ్యాయనీ తనను విమర్శించిన వారే మెచ్చుకున్నారంటూ ఈ సందర్భంగా హిమజ తెలిపారు. ఇక సోషల్ వర్క్ గురించి మాట్లాడుతూ బయట ఏదో చేయడం కంటే ముందుగా మన ఇంటిని మనం మంచిగా చూసుకోవాలి అంటూ తెలిపారు. అందుకే నేను తన డ్రైవర్ పిల్లలను చదివించే బాధ్యత తీసుకున్నానని తెలిపారు. తనకు ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఆ ముగ్గురు ఆడపిల్లలు చదువు బాధ్యత తానే చూసుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా హిమజ తెలిపారు.