Jagapathi Babu: అందుకే నేను వెనుకపడిపోయానేమో.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

జగపతి బాబు ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వారే. నిత్యం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈయన.. తర్వాత సినిమాలు లేకుండా డబ్బుల కోసం అవస్థలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజానికి జగపతి బాబు స్ట్రాంగ్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తి. ఒకప్పటి నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారి చిన్నబ్బాయి ఇతను. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇతనికి కేక్ వాక్ లానే గడిచిపోయింది.కానీ సక్సెస్ అవ్వడానికి చాలా టైం పట్టింది.

కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన జగపతి బాబు… శోభన్ బాబు తర్వాత జగపతి బాబు అనే రేంజ్ కు ఎదిగాడు. కానీ కేవలం ఆ ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకూడదని భావించి ‘గాయం’ వంటి విలక్షణమైన సినిమాలు కూడా చేసి సక్సెస్ లు అందుకున్నారు. ఈ దశలో ఆయనను ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువగానే పలకరించాయి. కొన్నాళ్ల తర్వాత ఈయన వ్యసనాల కారణంగా కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నారు. మరోపక్క సినిమాల్లో అవకాశాలు కూడా కరువయ్యాయి.

అలాంటి టైములో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. అది సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సినిమా వేడుకల్లో మాత్రం కనిపించడం లేదు. అందుకు గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జగ్గూభాయ్. ఆయన మాట్లాడుతూ.. “నా కెరీర్ మొదలయ్యి 34 ఏళ్లు పూర్తవుతోంది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నా వరకూ నేను నా స్థాయిలో ఎంతోకొంత సాధించాననే అనుకుంటున్నాను. సినిమాలు తప్ప నాకు ఇంకేం తెలీదు.

బిజినెస్ లు చేయడం తెలీదు. నలుగురిలో కలవడం తెలీదు .. మాట్లాడటం తెలీదు .. మాయమాటలు చెప్పడం తెలియదు.నేను ఎప్పుడూ కమర్షియల్ గా ఆలోచించను .. కమర్షియల్ గా బిహేవ్ చేయను.ఓ రకంగా అందువల్లే నేను వెనుకబడ్డానేమో. నేను సినిమా ఫంక్షన్స్ కి కూడా వెళ్లడం మానేసాను .. ఎందుకంటే అందరినీ పొగిడీ పొగిడీ అలసిపోయాను. స్టేజ్ పై అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి నుంచునే అవసరం నాకు లేదు అనిపిస్తుంది.” అంటూ చెప్పుకొచ్చాడు జగపతి బాబు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus