Actor Jairam Family: మలయాళం నటుడు జయరాం ఫ్యామిలీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

‘పంచతంత్రం’, ‘తుపాకీ’, ‘భాగమతి’, ‘అల వైకుంఠపురములో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళం హీరో, విలక్షణ నటుడు అయిన జయరాం. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాధే శ్యామ్’ లో కూడా ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. 1988లో వచ్చిన ‘అపరన్’ అనే చిత్రంతో తెరంగేట్రం చేసాడు జయరాం. ఆ తర్వాత మళయాళంలో వరస హిట్లు దక్కించుకుంటూ అక్కడ అగ్రహీరోగా ఎదిగాడు. అటు తర్వాత కోలీవుడ్లో కూడా అడుగుపెట్టి సెకండ్ హీరోగా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా రాణించాడు. సినిమాల్లోకి రాకముందు ఇతనో మిమిక్రీ ఆర్టిస్ట్.

4 దశాబ్దాలుగా తన నటనతో అలరిస్తున్న జయరాంకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించిన సంగతి తెలిసిందే. ఇంత గొప్ప నటుడైనప్పటికీ.. జయరాం భార్యా పిల్లల గురించి ఎక్కువ మందికి తెలుసుండక పోవచ్చు. జయరాం భార్య పేరు పార్వతి. ఈమె కూడా ఒకప్పడు మళయాళంలో టాప్ హీరోయిన్ గా రాణించింది. 1992లో వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. దాదాపు 70 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పార్వతి, అటు తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది. వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో అది పెళ్లి వరకూ దారితీసింది.

ఈ దంపతులకి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు పేరు కాళిదాస్. అతను ఇప్పటికే సినిమాల్లో హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన జయరాం తనయుడు, చిన్న వయసులోనే నేషనల్ అవార్డుని అందుకొని పాపులర్ అయ్యాడు. మలయాళంలో ప్రస్తుత యంగ్ హీరోల్లో కాళిదాస్ కు మంచి క్రేజ్ ఉంది.ఇక జయరాం కూతురి పేరు మాళవిక. ఈమె ఓ మోడల్. ప్రస్తుతం చిన్న చిన్న యాడ్స్ లో నటిస్తుంది. త్వరలోనే నటిగా మారడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus