సీనియర్ స్టార్ హీరో జయరాం (Jayaram Subramaniam) కుమారుడు కాళిదాస్ జయరాం (Kalidas Jayaram) పెళ్లి నిన్న కేరళలో ఘనంగా గుడిలో జరిగింది. తన ప్రియురాలు తరిణిని గురువాయూర్ గుడిలో పెళ్ళాడాడు. కాళిదాస్ జయరామ్ తమిళ, మలయాళ భాషల్లో హీరోగా నిలదుక్కుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. తరిణి ఆల్రెడీ మోడల్ గా ఫుల్ ఫామ్ లో ఉంది. గత నవంబర్ లో అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ తో తన రిలేషన్ షిప్ ను కన్ఫర్మ్ చేశాడు కాళిదాస్. ఈ ఇద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇకపోతే.. చాలా లిమిటెడ్ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ హాజరైన ఈ పెళ్లి వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేరళ మినిస్టర్ మరియు ఒకప్పటి స్టార్ హీరో అయిన సురేష్ గోపి ఈ వేడుకలో పాలుపంచుకున్నాడు. ఇకపోతే.. 2016లో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన కాళిదాస్ జయరాంకు “విక్రమ్” (Vikram) సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan ) కొడుకుగా పోషించిన చిన్న పాత్ర మినహా సరైన హిట్ లేదు. అటు తమిళంలో, ఇటు మలయాళంలో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ఇటీవల విడుదలైన “రాయన్”లో (Raayan) మాత్రం తమ్ముడి క్యారెక్టర్ పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి పెళ్లి అనంతరమైనా హీరోగా సరైన విజయం అందుకుంటాడో లేదో చూడాలి. మరోపక్క.. కాళిదాస్ జయరామ్ తండ్రి జయరాం మాత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. నిజానికి హీరోగా కంటే క్యారెక్టర్ ఆరిస్టుగానే ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు ఇప్పుడు. ఆల్రెడీ తండ్రి బాటలోనే క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న కాళిదాస్, తండ్రి స్థాయిలో ఎప్పటికీ బిజీ అవుతాడో మరి.