టాలీవుడ్ కి ఎంతో మంది హీరోలు మరియు కమెడియన్లు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. అంతే కాకుండా ఆయన శిష్యరికం లో వచ్చిన కొంతమంది దర్శకులు కూడా తమ మార్కు ని క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీ లో లెజెండ్స్ గా పేరు తెచ్చుకున్నారు. అలా జంధ్యాల ద్వారా హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమైనా నటుడు ప్రదీప్. ఈయన ఒకప్పుడు హీరో గా బాగా పాపులర్. ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ప్రదీప్ అంటే టక్కుమని ఎవరూ గుర్తుపట్టలేరు కానీ, ఎఫ్ 2 చిత్రం లో ‘అంతేగా..అంతేగా’ అనే డైలాగ్ చెప్పే వ్యక్తి అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. అయితే ఈయన గురించి చాలా మందికి చాలా విశేషాలు తెలియవు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నాడు. అవేంటో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘1992 వ సంవత్సరం లో లౌ బ్యాండ్ ఎక్విప్మెంట్ తో ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో ని ప్రారంభించాను.
అయితే ఆ స్టూడియో కి పెట్టుబడి 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. కొన్నాళ్ళు అద్భుతంగా నడిచింది, బాగా సంపాదించాను కూడా. అప్పట్లో కొంతమంది హీరోలకు డబ్బులు అప్పులకు కూడా ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే మధ్యలో లౌ బ్యాండ్ ఎక్విప్మెంట్ ని నిలిపివేసి, హై బ్యాండ్ ఎక్విప్మెంట్ ని ఉపయోగించాలని నియమం పెట్టారు. దీంతో నా స్టూడియో ని మూసి వెయ్యాల్సి వచ్చింది. అప్పుల పాలైపోయాను.
ఆ అప్పులను తీర్చేందుకు ఎంతో కష్టపడ్డాను. మళ్ళీ జీరో నుండి మొదలై ఇప్పుడు ఈ స్థానం లో మీ ముందు కూర్చున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. ఈయన ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్‘ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించాడు. ప్రస్తుతానికి (Pradeep) ప్రదీప్ సినిమా రంగంలో బీజీగా ఉన్నారు.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!