Maanas Engagement: ఘనంగా బ్రహ్మముడి మానస్ నిశ్చితార్థం..వధువు ఎవరంటే?..వైరల్ అవుతున్న ఫోటోలు!

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో మానస్ ఒకరు. బ్రహ్మముడి సీరియల్ ద్వారా క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న మానస్ నిశ్చితార్థ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మానస్ కు కాబోయే భార్య పేరు శ్రీజ నిశ్చంకర కావడం గమనార్హం. పలు సినిమాలలో బాల నటుడిగా నటించిన మానస్ సీరియల్ నటుడిగా పాపులారిటీని పెంచుకున్నారు.

తన ఆటిట్యూడ్ తో మానస్ అభిమానులకు మరింత దగ్గరయ్యారు. మానస్ కు కాబోయే భార్య శ్రీజ ప్రముఖ వ్యాపారి కూతురు అని సమాచారం అందుతోంది. పలు సినిమాలలో హీరోగా నటించిన మానస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడనే విషయం తెలిసి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంగరంగ వైభవంగా మానస్ నిశ్చితార్థ వేడుక జరగగా బిగ్ బాస్ ఫేమ్ సన్నీ, కాజల్ తో పాటు మరి కొందరు సీరియల్ నటులు ఈ వేడుకకు హాజరై ఆకర్షణగా నిలిచారు.

దీపారాధన, పితృదేవోభవ, కోయిలమ్మ సీరియల్స్ ద్వారా పాపులారిటీని పెంచుకున్న మానస్ బ్రహ్మముడి సీరియల్ కు సైతం తన టాలెంట్ తో మంచి రేటింగ్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మానస్ రేంజ్ మరింత పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానస్, శ్రీజ జోడీ అదుర్స్ అనేలా ఉండగా త్వరలో పెళ్లి తేదీకి సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది.

పెళ్లి తర్వాత మానస్ (Maanas) మరింత సంతోషంగా జీవనం సాగించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం మానస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కోయిలమ్మ హీరోయిన్ తేజస్విని కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మానస్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus