సినీ పరిశ్రమలో మరో విషాదం..క్యాన్సర్ తో ప్రముఖ నటుడు కన్నుమూత!
- August 28, 2023 / 12:29 PM ISTByFilmy Focus
సినీ ఇండస్ట్రీలో కొంతకాలంగా మరణాల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది శరత్ బాబు, గద్దర్ వంటి మహామహులు మరణించారు. అయినా నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. గద్దర్ మరణవార్త నుండి ఈ వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి అని చెప్పాలి. ప్రమాదాల వల్లో లేక అనారోగ్య సమస్యలతోనో లేదంటే వయసు సంబంధిత సమస్యలతోనో సెలబ్రిటీలు మరణిస్తున్నారు.నటీనటులు, నిర్మాతలు, దర్శకులు లేదంటే టెక్నికల్ టీం.. ఇలా ఎవరొకరి మరణవార్త వింటూనే ఉన్నాం.
ఒకవేళ వాళ్ళు కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మరణ వార్తలు వింటున్నాం. ఈ మధ్యనే నటి సీమా డియో కూడా వయసు సంబంధిత సమస్యలతో మరణించింది. ఇక ఈ షాక్ ల నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోకుండానే మరో నటుడు క్యాన్సర్ తో మరణించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మరాఠా ఇండస్ట్రీకి చెందిన నటుడు మిలింద్ సఫాయ్ మరణించడం జరిగింది. ఆయన వయసు 53 ఏళ్ళు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ వస్తున్న ఆయన శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది.

ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఆయ్ కుతే కే కర్తే’ అనే సీరియల్ తో (Milind Safai)ఇతను పాపులర్ అయ్యాడు.ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, మేకప్, థాంక్ యు విఠలా, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ వంటి చిత్రాల్లో నటించి ప్రామిసింగ్ నటుడు అనిపించుకున్నాడు. ఇక మిలింద్ సఫాయ్ మరణవార్త పై మరాఠా ప్రేక్షకుల్ని విషాదంలోకి నెట్టేసింది అని చెప్పాలి.
https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!














