ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరు పొంది ఎన్నో కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు వచ్చినవారి లిస్ట్ తీస్తే అందులో నటుడు మిథున్ చక్రవర్తి తప్పకుండా ఉంటాడు. జీరో నుంచి హీరోగా మారిన ఇతడి ప్రయాణం ఎంతోమందికి ఆదర్శకనీయం. కాగా మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన ‘మృగయ’ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఇతడు ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
తాజాగా నటుడు మిథున్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల కాలంలో ఓ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపేశాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఇప్పుడు తిండి దొరుకుతుందా? నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు.. ఇలా ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో.. చాలాసార్లు నేను ఫుట్‌పాత్‌ల మీదే నిద్రపోయాను.
అయితే ఇండస్ట్రీలో నన్నెవరు హీరోగా తీసుకుంటారని అనుకునేవాడిని. అందుకే, విలన్ అవ్వాలనుకున్నానని ఎమోషనల్ అయ్యారు. అయితే ఒకానొక సమయంలో ‘నేను అనుకున్నది సాధించలేనేమోనని భయపడేవాడిని. తిరిగి కోల్‌కతాకు కూడా వెళ్లలేకపోయాను. ఆ సమయంలో చనిపోదామనుకున్నాను. కానీ అందరికీ నేనిచ్చే సలహా ఒక్కటే.. ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి.. పోరాడండి. నేనూ ఫైట్ చేశాను.. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు.
ఇతను (Mithun Chakraborty) నటించిన సినిమాలు సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాడు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. ఈయన తెలుగులో ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర స్వామి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి డ్యాన్స్ బంగ్లా డ్యాన్స్ అనే రియాలిటీ సో షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ అయిన ఈ రియాలిటీ షో 12వ సీజన్ ప్రస్తుతం కొనసాగుతున్నది..
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!