సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పించారు. అలాగే నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన రాజకీయాలలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.
తెలుగు దేశం పార్టీ తరుపు నుంచి ఎంపీగా రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా (Murali Mohan) మురళీ మోహన్ నంది అవార్డ్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 1964 లో నంది అవార్డల ప్రధానోత్సవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం అయ్యింది. దేశంలో ఏ రాష్ట్రం అయినా కేంద్రం అయినా నటీనటులకు, కళాకరులకు అవార్డ్స్ ఇవ్వడం పరిపాటి. ఇలా ప్రైవేట్ గా ఎన్ని అవార్డ్స్ వచ్చినా ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ మాకు ఎంతో గౌరవం.
చాలా కాలం వరకు అవార్డుల ఉత్సవాలు దేదీప్యమానంగా ఇచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ వేరైనా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఏ విధమైనటువంటి అవార్డులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఇద్దరు ముఖ్య మంత్రులకు అవార్డుల విషయం గురించి చెప్పినా చేద్దాం.. చూద్దాం అనే పంథాలో ఉన్నారని తెలిపారు.
ఇలా ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకోవడం కోసం ఎంతో మంది నటీనటులు కళాకారులు ఎదురు చూస్తుంటారని ఇలా ప్రభుత్వం తరఫున అవార్డులు అందుకోవడం ఒక గౌరవంగా భావిస్తుంటారని ఈ సందర్భంగా మురళీమోహన్ నంది అవార్డుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అవార్డులను ఇచ్చారని తెలిపారు.