Naga Shaurya: నటి శ్రీలీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగశౌర్య!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం పవన్ బసం శెట్టి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో రంగ బలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాగశౌర్య నటించిన గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆలోచనలో నాగశౌర్య ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన రంగ బలి అనే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

తాజాగా సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి నాగశౌర్య పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తాజాగా నటి రష్మిక మందన్న గురించి పలు విషయాలు తెలియజేశారు.

ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్నటువంటి రష్మిక (Naga Shaurya) నాగశౌర్య కాంబినేషన్లో ఛలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా రష్మిక తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగులో కూడా వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందడమే కాకుండా నేషనల్ క్రష్ గా కూడా బిరుదు సంపాదించుకున్నారు.

నిజానికి ఈ బిరుదు రష్మికకు కాకుండా శ్రీ లీలకు ఇవ్వాల్సి ఉంటుందని నాగశౌర్య వెల్లడించారు. ఎందుకంటే చలో సినిమా కోసం ముందుగా శ్రీ లీలను ఎంపిక చేసామని చివరి నిమిషంలో తన స్థానంలో రష్మిక వచ్చిందని తెలిపారు. ఒకవేళ శ్రీ లీల నటించి ఉంటే తానే నేషనల్ క్రష్ అయ్యు ఉండేది అంటూ ఈ సందర్భంగా నాగశౌర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus