Nandu: విడాకుల వార్తలకు చెక్ పెట్టిన నందు.. ఫేక్ అంటూ క్లారిటీ!

సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు రావడం సర్వసాధారణం ఇలా సెలబ్రిటీల గురించి కొన్ని నిజాలు రాగా ఎన్నో అవాస్తవాలు చక్కెర్లు కొడుతుంటాయి. కొందరు సెలబ్రిటీలు వారి గురించి ఏదైనా తప్పుడు వార్తలు ప్రసారమైతే వెంటనే రియాక్ట్ అవుతూ ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం పెద్దగా పట్టించుకోరు. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాము.

ఈ క్రమంలోనే సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సింగర్ గీత మాధురి నటుడు నందుని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది. గీత మాధురి నందు తమ జీవితంలో ఎంత సంతోషంగా ఉండగా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

గీత మాధురి నందు (Nandu) ఇద్దరు కూడా విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు. ఎంతో సంతోషంగా ఉన్న వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడం ఏంటి అంటూ అందరూ షాక్ అయ్యారు. అయితే తాజాగా మాన్షన్ 24 సినీ ప్రమోషన్లలో భాగంగా నందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నందు విడాకుల వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ నందు మాట్లాడుతూ నేను గీత ఇద్దరు కూడా విడాకులు తీసుకోబోతున్నాము అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు చూసి మేమిద్దరం నవ్వుకున్నామని తెలియజేశారు. ఇలా మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాం అంటూ వార్తలు వచ్చాయని ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు అంటూ ఈ సందర్భంగా నందు క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు ఒక్కసారిగా పులిస్టాప్ పెట్టినట్లు అయింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus