‘ఛత్రపతి’ సినిమాలో బాజీరావు గుర్తున్నాడా? అదేనండీ ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు ఛత్రపతి ప్రభాస్ గొడ్డలతో నరుకుతాడు కదా, లేదంటే.. “యమదొంగ” సినిమాలో మెయిన్ విలన్ గా నటించాడు కూడా. అది కూడా గుర్తురాకపోతే “లెజండ్” సినిమాలో బాలయ్య కోపంతో “వెధవ సోది” అని తిట్టే మినిస్టర్ అయితే వెంటనే గుర్తుకురావచ్చేమో. ఆయన పేరు నరేందర్ ఝా. బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్, ఇటీవల షారుక్ ఖాన్ ?రయీస్” చిత్రంలోనూ కీలకపాత్ర పోషించాడు. ఆయన నేడు గుండెపోటు కారణంగా మృతిచెందాడు.
మోడల్ గా కెరీర్ ను ఆరంభించిన నరేందర్ ఝా బాలీవుడ్ లో ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు. మొదట సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసిన ఆయన.. అనంతరం విలన్ గా బాలీవుడ్ లో ఆల్మోస్ట్ అందరు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్ర పోషించడం విశేషం. సినిమాల్లో మాత్రమే కాక సీరియల్స్ లోనూ నరేందర్ ఝా నటించడం విశేషం. అలాంటి సీనియర్ నటుడి మరణం పట్ల బాలీవుడ్ సంతాపం తెలియజేస్తోంది. నరేందర్ ఝా మంచి నటుడు మాత్రమే కాదు అంతకుమించిన మంచి వ్యక్తి అని బాలీవుడ్ మీడియా పేర్కొనడం గమనార్హం.