సాధారణంగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి రావాలంటే అవకాశాలు తొందరగా వస్తాయి కానీ వారి టాలెంట్ ఆధారంగానే ఇండస్ట్రీలో నిలబడడం లేదా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కాస్త కష్టతరమే అని చెప్పాలి.ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అనంతరం ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వారి యంగ్ హీరో నిఖిల్.
ఈయన సినిమాలపై ఆసక్తితో కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గాను సీరియల్స్ లోను నటిస్తూ అవకాశాల కోసం ఎదురుచూశారు. ఇలా కెరియర్ మొదట్లో ఎంతో కష్టపడి అవకాశాలను అందుకున్న నిఖిల్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ నేడు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన 18 పేజెస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిఖిల్ సినిమా గురించి అలాగే తన కెరియర్లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తాను చదరంగం సీరియల్లో 40 ఎపిసోడ్ లలో నటించానని అయితే ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటానని చెప్పి ఆడిషన్స్ కి వెళ్ళానని తెలిపారు. చాలామంది ఆడిషన్స్ చేసిన తర్వాత అవకాశాలు ఇస్తామని ఫోన్లు చేశారు కానీ ఆ సినిమాలు ఆగిపోయాయి. ఇక ఒకానొక సమయంలో హీరోగా అవకాశం రావాలంటే 5 లక్షలు డబ్బు కావాలని చెప్పడంతో ఐదు లక్షలు కూడా ఖర్చు చేశానని
అయితే ఆ సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోయిందని నిఖిల్ తెలిపారు.ఇక నన్ను చూడగానే ఈ పాత్రకు తానే కరెక్ట్ గా సెట్ అవుతాడని నాకు అవకాశం ఇచ్చిన వారిలో శేఖర్ కమ్ముల గారు ఒకరు. హ్యాపీ డేస్ తర్వాత తన కెరియర్ పూర్తిగా మారిపోయిందని అయితే తనకు పస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చిన వారు కూడా శేఖర్ కమ్ముల అని చెప్పారు. ఇలా ఆయన చేతుల మీదుగా పాతిక వేల చెక్ తీసుకున్న తాను ఇప్పటికీ అలాగే భద్రంగా ఉంచుకున్నానని తెలిపారు.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?