సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఈ మధ్యన చూసుకుంటే గద్దర్ మరణవార్త అందరినీ కుదిపేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే తమిళ నటి సింధు క్యాన్సర్ తో మరణించగా, కన్నడ నటుడు విజయ్ భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. అటు తర్వాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫ్రిడ్ కిన్, మలయాళ దర్శకుడు సిద్ధిఖీ ,మలయాళ దర్శకుడు బాబీ మోహన్ , గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు పాల్ రెబెన్స్, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువ గాయకుడు మిచి కోబిన్ వంటి వారు కన్నుమూశారు.
ఈ షాక్ ల నుండి ఇండస్ట్రీ కోలుకోక ముందే మరో నటుడి తండ్రి కన్నుమూసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ‘మిర్జాపూర్’ ఫేమ్ పంకజ్ త్రిపాఠి తండ్రి పండిట్ బనారస్ తివారీ సోమవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. వయసు సంబంధిత సమస్యలతోనే వారు మరణించినట్టు తెలుస్తుంది. ఉత్తరాఖండ్ లో షూటింగ్ లో ఉన్న (Pankaj Tripathi) పంకజ్ త్రిపాఠీకి తన తండ్రి మరణ వార్త తెలిసింది. దీంతో హుటాహుటిన బీహార్..
గోపాల్ గంజ్ లోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. దీంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక పంకజ్ త్రిపాఠికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చారు. ఇక పంకజ్ త్రిపాఠి.. ఇటీవల ‘ఓ మై గాడ్ 2 ‘ సినిమాల్లో నటించి మెప్పించాడు.