లక్షో, రెండు లక్షలో ఇస్తారనుకున్నా.. చిరంజీవి చేసిన సాయం గురించి పొన్నాంబళం ఏం చెప్పారంటే..!

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడానికి పైనుండి దేవుడు దిగిరానవసరం లేదు.. పక్కనున్న వారు పెద్ద మనసుతో ఓ అడుగు ముందుకేస్తే చాలు.. అలా తలో చేయి వేస్తే ఆపద అనేది ఆమడ దూరం పారిపోతుంది.. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే క్షణాల్లో స్పందిస్తారు.. స్టార్ హీరోగా బాగా బిజీగా ఉన్నప్పుడే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి తన వంతుగా సామాజిక సేవ చేయడం మొదలు పెట్టారాయన..

సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే పిలిచి సాయం చేస్తారు.. కరోనా టైం చిరు చేసిన సేవలు మరిచిపోలేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు, సీసీసీ ద్వారా సినీ కార్మికులకు చేయూత.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు చేశారు మెగాస్టార్.. అలాగే తమ కోడలు ఉపాసన కుటుంబానికి చెందిన అపోలో ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి వైద్య సాయమందించారు..

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం తెలుగు, తమిళంలో విలన్‌గా నటించి ఆకట్టుకున్న పొన్నంబళం అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి చిరు సాయం చేశారు.. ధైర్యంగా ఉండమని ఆయనను ఫోన్‌లో పరామర్శించారు.. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.. అయితే ఇటీవల పొన్నాంబళం ఓ ఇంటర్వూలో చిరంజీవి తనకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చారు.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.. చిరు మంచి మనసుకు అందరూ ఆయనను అభినందిస్తున్నారు.. ప్రశంసిస్తున్నారు..

పొన్నాంబళం మాట్లాడుతూ.. ‘‘నా ఆరోగ్యం క్షీణిస్తున్న టైంలో సాయం కోసం ఎవరినడగాలో తెలియక, నా ఆరోగ్యం బాగోలేదు అన్నా.. కిడ్నీ ఫెయిల్ అయింది అన్నా హెల్ప్ చెయ్యండని చిరంజీవి గారిని అడిగాను.. రూ. 1 లక్షో, 2లక్షలో సహాయం చేస్తారనుకుంటే.. నేనున్నా అని చెప్పి, 5 నిమిషాల్లో నీకు ఫోన్ వస్తుందని చెప్పారు.. రిపోర్ట్స్ తీసుకుని చెన్నైలో దగ్గరలో ఉన్న అపోలోకి వెళ్ళి అడ్మిట్ అవ్వమని చెప్పారు.. అక్కడ నన్ను ఎంట్రీ ఫీజ్ కూడా అడగలేదు.. మొత్తం 40 లక్షలు అయ్యింది.. మొత్తం చిరంజీవి గారే చూసుకున్నారు’’ అని చెప్పుకొచ్చారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus