Posani Krishna Murali Arrested: అజ్ఞాతంలో ఉంటూ వచ్చిన పోసానిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు!

నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు. రాజకీయాల్లో ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకోవడం, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ వారిని వ్యక్తిగతంగా అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా హేయమైన వ్యాఖ్యలు చేశారు పోసాని.

Posani Krishna Murali Arrested

వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని రెచ్చిపోయేవారు. తర్వాత ఆ పార్టీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పోసాని తగ్గలేదు. ‘ఏం పీక్కుంటారో పీక్కోండి’ అంటూ రెచ్చిపోయారు.ఈ క్రమంలో పోసానిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని రాజకీయాల్లో ఉన్నానని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.

అయితే ఇన్నాళ్లు పరారీలో ఉంటూ వచ్చిన పోసాని మొత్తానికి.. హైదరాబాద్, రాయదుర్గం ‘మై హోమ్ భూజ అపార్ట్మెంట్’ లో అరెస్ట్ అయ్యారు. రాయచోటి పోలీసులు పోసానిని హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని ఏపీకి తరలిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పోసాని. ఆయనకు అవకాశాలు కూడా ఎక్కువగా లేవు. ఆయన గతంలో నటించిన సినిమాలు కొన్ని ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ రైటర్ గా పీక్స్ చూసిన పోసాని.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ, కమెడియన్ గానూ సత్తా చాటారు. అయితే అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లి.. ఆయన మంచి కెరీర్ ను పాడుచేసుకున్నట్టు అయ్యింది.

పాత సినిమా, కొత్త ప్రాజెక్ట్‌ సీక్వెల్స్‌ ప్రకటించిన త్రినాథరావు నక్కిన!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus