Chandrahas: బిగ్ బాస్7 లో చంద్రహాస్.. ఈ షో రేటింగ్ పెరగడం ఖాయమా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 త్వరలో మొదలుకానుంది. చాలామంది పేర్లు హోస్ట్ గా వినిపించినా చివరకు నాగార్జున ఈ షోకు హోస్ట్ గా ఎంపికయ్యారని సమాచారం. బ్యాంకాక్ పిల్ల శ్రావణి సమంతపూడి ఈ షోలో పాల్గొంటారని వార్తలు ప్రచారంలోకి వచ్చినా బ్యాంకాక్ పిల్ల స్వయంగా స్పందించి వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పేశారు. బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని తెలిసి నెటిజన్లు ఫీలవుతున్నారు.

అయితే బిగ్ బాస్ షో సీజన్7లో చంద్రహాస్ కనిపించనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. యాటిట్యూడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్ నటించిన సినిమాలేవీ విడుదల కాకపోయినా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు. ఆగష్టు ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ షో సీజన్7 తెలుగు ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది.

నాగార్జున ఈ షో కోసం అత్యంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. చంద్రహాస్ బిగ్ బాస్ షోలోకి వస్తే అతనికి పాపులారిటీ మరింత పెరిగే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రహాస్ నో చెబితే చంద్రహాస్ తండ్రి, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. చంద్రహాస్, ప్రభాకర్ లలో ఎవరు ఎంట్రీ ఇచ్చినా బిగ్ బాస్ షో మామూలుగా ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రహాస్ (Chandrahas) ఫన్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటే సక్సెస్ సాధించడం సులువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రహాస్ భిన్నమైన కథలను ఎంచుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చంద్రహాస్ ఏదో ఒక విధంగా ఫేమస్ అవుతున్నారు. బిగ్ బాస్ షో సీజన్7 కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ సీజన్7 మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus