చిరు సినిమాలో కాలకేయుడు..?

అప్పటివరకు చిన్న చిన్న విలన్ రోల్స్ లో నటించిన ప్రభాకర్ ‘బాహుబలి’ సినిమాతో కాలకేయ ప్రభాకర్ అని పేరు తెచ్చుకున్నాడు. ఒక్కసారిగా తన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన ‘రైట్ రైట్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాకర్ మీడియాతో ముచ్చటించాడు. పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. పోలీస్ అవుదామనుకొని ఆర్టిస్ట్ అయ్యానని దానతంటికీ కారణం రాజమౌళి గారే అని చెప్పాడు.

మర్యాద రామన్న, బాహుబలి వంటి చిత్రాలతో నాకు స్టార్ డం క్రియేట్ చేసిన ఆయనను ఎప్పటికి మరచిపోనని చెప్పాడు. రైట్ రైట్ సినిమాలో ఓ పాజిటివ్ డ్రైవర్ పాత్రలో నటించిన ప్రభాకర్ ఈ రోల్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తాను చూపించే ప్రయత్నం చేసానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రోజు వినాయక్ గారు ప్రభాకర్ ను పిలిచి మాట్లాడి, నీకొక పాత్ర ఆఫర్ చేస్తాను.. నటిస్తావా..? అని అడిగారట. అదొక పాజిటివ్ రోల్ అని తెలుస్తోంది. వినాయక్ ప్రస్తుతం డైరెక్ట్ చేస్తోంది చిరు 150 ఒక్కటే. అంటే ప్రభాకర్ ను చిరు 150 సినిమా గురించే అడిగి ఉంటారని అంతా భావిస్తున్నారు. అదే నిజమైతే ఈ సినిమాతో ప్రభాకర్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus