ప్రముఖ డైరెక్టర్ తో ఘనంగా నటుడు ప్రభు కుమార్తె వివాహం!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఈ క్రమంలోనే నేడు శుక్రవారం చెన్నైలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు.

ఈ క్రమంలోనే నటుడు విశాల్ కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోని ఈయన ఈ పెళ్లిలో దిగినటువంటి ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నా చెల్లెలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ తన స్నేహితుడు డైరెక్టర్ కి సలహాలు ఇచ్చారు. నా చెల్లెల్ని బాగా చూసుకోమని నీకు చెప్పాల్సిన పనిలేదు నువ్వు చాలా బాగా చూసుకుంటావు సరదాగా అన్నాను

అంటూ చెప్పుకువచ్చారు అదేంటో నాకు చెల్లెలు అయ్యే వారందరూ కూడా (Aishwarya) ఐశ్వర్య అనే పేరుతోనే ఉన్నారు అంటూ ఈ సందర్భంగా పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇకపోతే ప్రభు కుమార్తె ఐశ్వర్యకు ఇది రెండవ వివాహం కావడం విశేషం. ఇదివరకే ఐశ్వర్య కునాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు.

అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి ఐశ్వర్య డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ను రెండవ వివాహం చేసుకున్నారు. ఇక ఈ పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus