ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రణీతా సుభాష్ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కమర్షియల్ గా ఏం పిల్లో ఏం పిల్లడో సక్సెస్ కాకపోయినా ప్రణీత కెరీర్ కు ప్లస్ అయింది. తొలి సినిమా తరువాత ప్రణీత బావ సినిమాలో నటించగా ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడిన ప్రణీత సుభాష్ కు అత్తారింటికి దారేది సినిమాలో ఛాన్స్ రావడం ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడం తెలిసిందే.
అయితే ఇండస్ట్రీ హిట్ ఉన్నా సరైన కథలను ఎంపిక చేసుకోకపోవడం వల్ల అత్తారింటికి దారేది మూవీ తరువాత ప్రణీత నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె తెలుగులో ఆఫర్లు తగ్గాయి. అత్తారింటికి దారేది సినిమాతో బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న ప్రణీత తనకు గొప్ప మనస్సు ఉందని ప్రూవ్ చేసుకున్నారు. ప్రణీత కరోనా సమయంలో ఆకలితో ఇబ్బందులు పడుతున్న 75,000 మంది ఆకలి తీర్చారు. ప్రణీత ఒకవైపు హీరోయిన్ గా ఇతర ఇండస్ట్రీల్లో సినిమాల్లో నటిస్తూనే 21 రోజుల్లో ఏకంగా 75,000 మంది ఆకలి తీర్చారు.
లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన 50 కుటుంబాలకు ప్రణీత 2,000 రూపాయల చొప్పున సాయం చేశారు. హెల్ప్‌ది హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో 10 లక్షల రూపాయలను విరాళంగా సేకరించి 450 కుటుంబాలను ప్రణీత ఆదుకున్నారు. ప్రణీత తల్లిదండ్రులు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించగా ప్రణీత కూడా వాళ్ల బాటలోనే నడుస్తున్నారు. ప్రణీత ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ప్రణీత తన వంతు సహాయం చేస్తున్నారు. సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ పేరుతో ప్రణీత బెంగళూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ప్రణీత పేద ప్రజలకు హెల్త్ చెకప్ లు చేయించి వాళ్లకు ఆరోగ్యంపై అవగాహన కలిగేలా చేస్తున్నారు.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!