Raghava Lawrence: గౌరవ సత్కారాన్ని అందుకున్న నటుడు లారెన్స్?

లారెన్స్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఈయనకు కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. లారెన్స్ డాన్స్ మాస్టర్ గా, నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో కూడా లారెన్స్ నటించిన కాంచన, గంగ సినిమాలు లారెన్స్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. తెలుగులో హర్రర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన శివగంగ సినిమా తర్వాత లారెన్స్ నుంచి ఎలాంటి సినిమాలు తెలుగులో విడుదల కాలేదు.

ఈ విధంగా చాలా కాలం పాటు వెండితెరకు దూరమైన లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రుద్రుడు అనే థ్రిల్లర్ జోనర్ లో ఓ సినిమాతో లారెన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అదేవిధంగా వాసు దర్శకత్వంలో తెలిపిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి2 లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ విధంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న లారెన్స్ మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

లారెన్స్ ఎంతోమంది అనాధలను వికలాంగులను చేరదీసి వారికోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేసి వారి బాగోగులు చూసుకుంటున్నారు.అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉన్నారని ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసిన వెంటనే వారికి సహాయం చేయడానికి లారెన్స్ ముందు వరసలో ఉంటారు. ఈ విధంగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఈయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. లారెన్స్ సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్‌ ప్రకటించాయి.

ఈ క్రమంలోని ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. లారెన్స్ రుద్రుడు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఇక ఆయన స్థానంలో తన తల్లి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ విధమైనటు వంటి అవార్డు అందుకోవడానికి లారెన్స్ సరైనోడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus