Chinmayi: మొదటిసారి భార్య గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందించిన రాహుల్!

సినీ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అదే స్థాయిలో వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఎప్పుడైతే ఈమె తమిళ ప్రముఖ రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేశారో అప్పటినుంచి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ విధంగా వైరుముత్తుపై లైంగిక ఆరోపణలు చేయడంతో ఈమె పట్ల కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తనని బహిష్కరణ చేసింది.

అప్పటినుంచి తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడమే కాకుండా సమాజంలో మహిళలకు ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య గురించి తన స్టైల్ లో ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా చిన్మయి చేసే పోస్టులు పట్ల ఎంతోమంది నెగిటివ్ కామెంట్లు చేస్తూ తనని ట్రోల్ చేశారు. ఇలా తన గురించి ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం వెనకడుగు వేయకుండా తన గళం వినిపిస్తున్నారు.

ఇకపోతే మొదటిసారి (Chinmayi) చిన్మయి గురించి జరిగిన ట్రోల్స్ పై తన భర్త నటుడు రాహుల్ రవీందర్ స్పందించారు. ఈ క్రమంలోనే తన గురించి ట్రోల్స్ చేస్తూ ఆ పోస్టును తన భర్త రాహుల్ రవీందర్ కి కూడా ట్యాగ్ చేయడంతో ఆయన ఈ విషయంపై స్పందించారు. ఈ క్రమంలోనే తన భార్యకు సపోర్ట్ చేస్తూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రాహుల్ రవీందర్ స్పందిస్తూ చిన్మయిని అందరూ ఒక సెలబ్రిటీగా కాకుండా తాను సమాజంలోని సమస్యలపై చేసే పోరాటాన్ని మాత్రమే గమనించండి.

ఆమె చేసే పనిని ప్రశంసించక పోయినా పర్వాలేదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందుగా ఆమె చెప్పేది ఆలోచించి ఆ తర్వాత మీరు తనతో ఏకీభవిస్తారా తనని వ్యతిరేకిస్తారా అన్నది మీ ఇష్టం. తను అందరితోనూ ఎంతో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిగా మీ అక్క లాగా ఉంటుంది తన ప్రేమకు లిమిట్స్ అనేవి ఉండవు. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని మరొక యాంగిల్ లో చూసినప్పుడు మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అంటూ ఈ సందర్భంగా రాహుల్ రవీందర్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus