Raj Tarun: ‘అహ నా పెళ్ళంట’ సిరీస్ గురించి హీరో రాజ్ తరుణ్ చెప్పిన ఆసక్తికర విషయాలు.!

  • November 14, 2022 / 06:56 PM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించిన ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ నవంబర్ 17 నుండీ 8 ఎపిసోడ్స్ గా జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సిరీస్ ఫన్ ఫిల్ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు టీజర్, ట్రైలర్లు స్పష్టం చేశాయి. ఇక ప్రమోషన్లలో భాగంగా రాజ్ తరుణ్ పాల్గొని ‘అహ నా పెళ్ళంట’ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు మీ కోసం :

‘అహ నా పెళ్ళంట’ జర్నీ ఎలా మొదలైంది?

మా డైరెక్టర్ సంజీవ్ గారు, రైటర్ దావూద్ గారు వచ్చి ఈ ఐడియా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చేసింది. డేట్ వంటివి నాకు గుర్తులేదు కానీ.. కచ్చితంగా ఈ సిరీస్ లో నటించాలి అని ఫిక్స్ అయ్యాను. శివాని కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్. చాలా కాలంగా మేము కలిసి వర్క్ చేయాలి అనుకున్నాం. ‘అహ నా పెళ్ళంట’ తో అది కుదిరింది. అంతే అంతకు మించి పెద్ద కథ అంటూ లేదు.

‘అహ నా పెళ్ళంట’ కథ విన్నప్పుడు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి?

ఇది ఒక ఫ్యామిలీ డ్రామా..! అదే టైంలో ఎంటర్టైన్మెంట్ కి బాగా స్కోప్ ఉంది. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది.

మీ సినిమా అనేసరికి ఆడియన్స్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇందులో వాటికి ప్రాధాన్యత ఎంత వరకు ఉండబోతుంది?

ఈ సిరీస్ లో ఫన్ కు అండ్ ఎంటర్టైన్మెంట్ కు హద్దు అదుపు ఉండవు. నవ్వి నవ్వి దవడలు నొప్పెట్టేస్తాయి. ఆ విషయంలో నేను డాం స్యూర్ అని చెబుతాను.

మీరు మంచు విష్ణుగారితో కలిసి ‘ఈడో రకం ఆడో రకం’ చేశారు. ‘అహ నా పెళ్ళంట’ టీజర్ లో మంచు విష్ణు గారు రీసెంట్ గా చెప్పిన ఓ డైలాగ్ ను పెట్టారు?

అది హైలెట్ అయ్యింది.. నిజమే..! కానీ విష్ణు గారి రిఫరెన్స్ తో ఆ డైలాగ్ పెట్టారు అని నాకు తెలీదు.టీజర్ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది నాకు..! విష్ణు బ్రదర్ నాకు చాలా క్లోజ్. ఆయన ఇలాంటి వాటికి అస్సలు ఫీలవ్వడు. అతను కూడా ఫన్నీగా తీసుకుంటాడు.

మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి?

జుడా శాండీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. టైటిల్ సాంగ్ తో పాటు ఇంకో 4 పాటలు వినడానికి చాలా బాగుంటాయి.

ఈ సిరీస్ లో హీరో, హీరోయిన్ల రోల్స్ కాకుండా.. మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి?

నా ఫ్రెండ్స్ రోల్ చేసిన త్రిశూల్, రవి పాత్రలు బాగా నచ్చాయి. వాళ్ళిద్దరూ కూడా కామెడీ ఇరక్కొట్టేశారు.

మీ స్లాంగ్ ను కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు. చాలా ఈజ్ తో చెప్పినట్టు ఉంటుంది.. మీ కో ఆర్టిస్ట్ లతో కూడా అలానే మాట్లాడతారా?

అలానే మాట్లాడతాను. మొదట్లో అయితే నా మాట చాలా మందికి అర్థం కాదు. శివాని నాకు ఫ్రెండ్ కాబట్టి తనకి అర్థమైపోతుంది. ఇప్పుడైతే అందరికీ అర్ధమయ్యేలా మాట్లాడుతున్నాను.

శివాని రాజశేఖర్ గారి రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. మీతో చేసిన ఈ సిరీస్ తో మరోసారి ఆమె ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు? ఆమె గురించి చెప్పండి?

కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆమె సినిమాలు ఓటీటీకి వెళ్లాయి. నా ‘ఒరేయ్ బుజ్జిగా’ కూడా ఓటీటీకి వెళ్ళింది.(నవ్వుతూ) అయితే శివాని మాత్రం చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్. హార్డ్ వర్కర్.

డైరెక్టర్ సంజీవ్ గారి గురించి చెప్పండి?

చాలా కూల్ పర్సన్,టాలెంటెడ్ పర్సన్. సెట్ లో వాతావరణం అంతా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అంటే ఆయన వల్లే. కనీసం మైక్ లో కూడా ఆయన మాట్లాడడు. అరిచినట్టు ఉంటుంది అని భావించి ఆయన మైక్ లో రెడీ అవ్వడు..!

మీరు షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను కెరీర్ ను మొదలుపెట్టారు? సినిమాలు చేశారు. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. ఇప్పుడు ‘అహ నా పెళ్ళంట’ తో డిజిటల్ ఎంట్రీ(ఓటీటీ) ఎంట్రీ ఇవ్వబోతున్నారు?

నేను ప్రత్యేకంగా ఎంట్రీ ఇస్తున్నాను అని ఫీల్ అవ్వలేదు. ఇది కూడా ఓ ప్రాజెక్టు గా భావించి చేశాను. కొన్ని కథలు పావు గంటలో చెప్పేవి ఉంటాయి. అవి యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ గా బాగుంటాయి. ఇంకొన్ని గంటన్నర, రెండు గంటల టైంలో చెప్పేవి ఉంటాయి. అవి సినిమాలుగా బాగుంటాయి. మరికొన్ని అయితే 4, 5 గంటల్లో చెప్పేవిగా ఉంటాయి. ఇలాంటివి వెబ్ సిరీస్ లుగా బాగుంటాయి. ఎందులో చేసినా షూటింగ్లో పాల్గొనాల్సిందే.మన ఎఫర్ట్ పెట్టాల్సిందే.

‘తమడా మీడియా’ బ్యానర్లో చేయడం ఎలా అనిపించింది?

చాలా కంఫర్టబుల్ అండి. కథకి ఏం కావాలన్నా క్షణాల్లో ఏర్పాటు చేసేస్తుంటారు. ది బెస్ట్ ఇవ్వాలని అనుక్షణం పరితపిస్తుంటారు. ఈ బ్యానర్లో వెంటనే మరో ప్రాజెక్టు చేయడానికి కూడా నేను రెడీ.

రాహుల్ ,సాయి దీప్, హర్ష లతో మీ ప్రయాణం ఎలా సాగింది?

ఇండస్ట్రీకి చాలా అవసరమైన ప్రొడ్యూసర్స్ అండి వీళ్ళు. రాహుల్ గారు చాలా మంచి వ్యక్తి, అయితే నాకు సాయి దీప్, హర్ష చాలా క్లోజ్. షూటింగ్ లొకేషన్స్ లో వాళ్ళు మంచి వాతావరణం క్రియేట్ చేస్తారు. అందుకే మళ్ళీ మళ్ళీ ఈ బ్యానర్ లో చేయాలి అనిపిస్తుంది.

‘తమడా మీడియా’ బ్యానర్లో రూపొందిన సినిమాలు/సిరీస్ లు అంతకు ముందు ఏమైనా చూశారా? చూస్తే అందులో మీకు బాగా నచ్చింది ఏది?

‘నెట్’ ‘ఆవకాయ ఆణిముత్యం’ చూశాను. ఇంకా వెబ్ సిరీస్ లు చాలా చూశాను. యూట్యూబ్ లో కూడా ఎక్కువగా ఫాలో అవుతాను.

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus