మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో చాలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ‘ఇంద్ర’ (Indra) మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అభిమానులు కూడా ‘ఇంద్ర’ అంటే స్పెషల్ గా భావిస్తారు. బి.గోపాల్ (B. Gopal) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ (C. Aswani Dutt) నిర్మించారు. 2002 జూలై 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది.
100 వ రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టిన ఘనత ‘ఇంద్ర’ కి దక్కింది. మెగాస్టార్ కెరీర్లో ఓ మైలురాయిగా మిగిలిపోయిన ‘ఇంద్ర’ చిత్రాన్ని 22 ఏళ్ల తర్వాత అదీ చిరంజీవి పుట్టినరోజు నాడు రీ రిలీజ్ చేస్తున్నారు అంటే.. అంచనాలు ఏ రేంజ్లో నెలకొంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కచ్చితంగా రీ- రిలీజ్ సినిమాల్లో ‘ఇంద్ర’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.
‘ఇంద్ర’ లో మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ పెట్టే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాస్తవానికి ‘ఇంద్ర’ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చాలా వరకు చిరంజీవి డైరెక్ట్ చేశారట. ఈ విషయాన్ని చిరంజీవికి మేనేజర్ లాంటి నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘అల్లరి రాముడు’ (Allari Ramudu) సినిమా సాంగ్స్ పిక్చరైజేషన్ కోసం దర్శకుడు బి.గోపాల్ విదేశాలకు వెళ్తే.. రిలీజ్ ఆలస్యం కాకూడదని భావించి ‘ఇంద్ర’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని, ముఖ్యంగా యజ్ఞం సీన్ ఎపిసోడ్, అలాగే వర్షం సాంగ్ ను చిరు డైరెక్ట్ చేశారట. అవి సినిమా కథలో అత్యంత కీలకంగా ఉంటాయి.