Nani: సుందరం.. ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదంటే.. నాని ఏమన్నాడంటే?

ఒక సినిమాకు వచ్చాక దాని ఫలితం గురించి పట్టించుకోని హీరోలు కొంతమంది ఉంటారు. అలాగే సినిమా ఫలితం కాస్త తేడా కొట్టినా.. ఆ సినిమా బాగానే ఉంది, మంచి స్పందన వచ్చింది అని చెప్పే హీరోలూ ఉంటారు. అయితే వాళ్లు కొన్నాళ్ల తర్వాత ఫలానా సినిమా అనుకున్నంతగా ఆడలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే.. రెండేళ్ల క్రితం సినిమా గురించి ఇప్పుడు చర్చ జరిగింది కాబట్టి.

Nani

నాని  (Nani)  హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki) అనే ఓ సినిమా చేసింది. నజ్రియా నజీమ్‌ (Nazriya Nazim) హీరోయిన్‌గా చాలా రోజుల తర్వాత నటించిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర భారీ అంచనాలతో వచ్చింది. అయితే ఫలితం దగ్గరకు వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాలేదు. ఆ రోజుల్లో సినిమా విజయం పట్ల అంతోకొంత సానుకూలంగా స్పందిస్తూ వచ్చిన నాని.. ఇప్పుడు ఆ సినిమా ఫలితం తేడా కొట్టేసింది అని ఒప్పుకున్నారు.

నాని కెరీర్‌లో ఎక్కువ నష్టాలు చవిచూసిన సినిమాల లిస్ట్‌ రాస్తే అందులో ‘అంటే సుందరానికి’ తొలి స్థానాల్లోనే ఉంటుంది. అయితే ఈ సినిమా ఫలితం మిస్‌ ఫైర్‌ అవ్వడానికి కారణం దర్శకుడు కాదని, మరొకరు అని నాని అంటున్నాడు. తమ కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  ప్రచారంలో భాగంగా నాని ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. ‘అంటే సుందరానికీ’ సినిమా ఫలితం అలా కావడానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ (Vivek Athreya) తప్పేమీ లేదని అన్నాడు.

తనకు వివేక్‌ స్క్రిప్ట్ నెరేట్‌ చేస్తున్నప్పుడు ఏం చెప్పాడో అదే తీశాడని నాని అన్నాడు. అయితే ‘అంటే సుందరానికీ’ సినిమా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది లాంటి అంచనాలు ప్రేక్షకుల ముందు ఉంచలేదు. దాంతో ఊహించిన సినిమా కాకుండా వేరేది రావడంతో ఫలితం తేడా కొట్టింది అన్నాఉ నాని. ఇక ఆ సినిమా ఫెయిల్యూర్ బాధ్యత నాదే అని నాని చెప్పేశాడు.

వివాహేతర సంబంధాలపై నటి షాకింగ్ కామెంట్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus