Rajasekhar: ‘ఎక్స్ట్రా’ కోసం రాజశేఖర్ గట్టిగానే అందుకుంటున్నాడుగా..!

యాంగ్రీ యంగ్‌ మెన్ గా పవర్ ఫుల్ రోల్స్ కి పెట్టింది పేరు రాజశేఖర్‌. ఒకప్పుడు ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు అందించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అయితే కాలం మారింది.. కొత్త హీరోలు వచ్చారు. వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టు సీనియర్ హీరోలను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకే జగపతి బాబు వంటి సీనియర్ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి తమకు నచ్చిన పాత్రలు చేస్తూ బిజీ యాక్టర్స్ గా రాణిస్తున్నారు.

అప్పుడప్పుడు హీరోలుగా సినిమాలు చేసినా వాటికి ఓటీటీ బిజినెస్ లు బాగానే జరుగుతున్నాయి. ఇలా రాజశేఖర్ మాత్రం చేయడం లేదు అనే కంప్లైంట్ ఉంది. ‘రంగస్థలం’ లో జగపతి బాబు పాత్ర కోసం ముందుగా రాజశేఖర్ నే అనుకున్నారు సుకుమార్, తర్వాత ‘రామబాణం’ లో కూడా జగపతి బాబు పాత్రకి రాజశేఖర్ ఫిక్స్ అనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ రాజశేఖర్ వాటిని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన కెరీర్ ప్రారంభంలో నెగిటివ్ రోల్స్ కూడా చేశారు.

ఇప్పుడు మాత్రం ఆయన నిరాకరిస్తూ వచ్చారు. అయితే మొత్తానికి నితిన్ చేస్తున్న ‘ఎక్స్ట్రా’ మూవీ కోసం రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. దర్శకుడు వక్కంతం వంశీ చాలా కష్టపడి ఈయన్ని ఒప్పించడం జరిగింది. ఈ సినిమాకి గాను రాజశేఖర్ గట్టిగానే పారితోషికం డిమాండ్ చేసినట్టు వినికిడి. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఎక్స్ట్రా’ సినిమా కోసం రాజశేఖర్ రూ.6 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే.. (Rajasekhar) రాజశేఖర్ ఇంకా బిజీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus