ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి శరత్ బాబు గత కొద్దిరోజులుగా బెంగళూరులో చికిత్స తీసుకొని కొంత మేర కోలుకున్నారు.అయితే తాజాగా ఈయనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఈయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా శరత్ బాబు హెల్త్ అప్డేట్ వైద్యులు వెల్లడించారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.ప్రస్తుతం తనని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని మరికొన్ని గంటలు గడిస్తే తప్ప తన పరిస్థితి గురించి వెల్లడించలేమని తెలియజేశారు. ఇప్పటికే శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించిందని వైద్యులు పేర్కొన్నారు. శరత్ బాబుకి కాలేయం కిడ్నీ ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలు కూడా పాడైపోయాయని వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇలా అవయవాలు పాడైపోవడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే ఈయనకు చికిత్స అందిస్తున్నామని అయితే ఈయన పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక తిరిగి ఈరోజు సాయంత్రం మరోసారి ఈయన హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని శరత్ బాబు సన్నిహితులు తెలియజేస్తున్నారు.ఇలా ఈయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
ఇక శరత్ బాబు సినిమాల విషయానికి వస్తే 1973 వ సంవత్సరంలో మొదటిసారిగా ఈయన రామరాజ్యం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ కన్నడ మలయాళ భాషలలో కూడా నటిస్తూ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు 200కు పైగా సినిమాలలో నటించిన శరత్ కుమార్ ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోని ఈయన అనారోగ్యానికి గురికావడంతో గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.