ఇండస్ట్రీలో వరుస విషాదాలు..మరో నటుడు మృతి..!

  • July 30, 2022 / 10:17 AM IST

గత 40 రోజుల్లో సినీ పరిశ్రమకి చెందినవారెంతోమంది మరణించారు.పలు విభాగాలకు చెందిన టెక్నీషియన్లు అలాగే నిర్మాతలు,నటులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి.టాలీవుడ్ లో అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్,మలయాళం,పంజాబీ.. ఇలా చాలా భాషల్లోకి చెందిన సినీ ప్రముఖులు అలాగే ఫ్యాషన్ డిజైనర్ లు వంటి వారు మరణించడం చూశాం. మీనా భర్త, రాధికా శరత్ కుమార్ మాజీ భర్త, అర్జున్ తల్లి, నోయల్ తండ్రి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉందని చెప్పాలి.

ఈ మధ్యనే బాలీవుడ్ కు చెందిన కమెడియన్ దీపేష్ భన్ కూడా క్రికెట్ ఆడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు గడవకముందే మరో యువ నటుడు మరణించాడు.మలయాళం నటుడు శరత్ చంద్రన్ శుక్రవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆయన సొంత నివాసంలోనే మరణించడం గమనార్హం.ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా వంటి చిత్రాలతో ఇతను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

శరత్ కు తండ్రి చందన్, తల్లి లీలతో పాటు ఓ సోదరుడు ఉన్నారు.శరత్ నటుడు కాకముందు గతంలో ఓ ఐటీ సంస్థలో పనిచేశాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశాడు.ఇతని వయసు 37 ఏళ్ళ మాత్రమే కావడం అందరినీ బాధ పెట్టే అంశం.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus