సినీ నటుడు తమిళనాడు మంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ తాజాగా వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఓ కార్యక్రమంలో పాల్గొని నిర్మూలించిన విధంగానే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తమిళనాడు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదంగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ఉదయనిది స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించడమే కాకుండా పలుచోట్ల ఆయనపై కేసులు కూడా పెట్టారు.
సోషల్ మీడియాలో కూడా ఉదయనిధి స్టాలిన్ గురించి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. అయితే మరికొందరు సెలబ్రిటీలు మాత్రం ఉదయనిది స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలలో ఏమాత్రం తప్పులేదు అంటూ ఈయనకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాహుబలి కట్టప్ప గా ఎంతో ఫేమస్ అయినటువంటి నటుడు సత్యరాజు ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై స్పందించారు.
ఈ సందర్భంగా సత్య రాజ్ (Sathyaraj) మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి ఉదయనిది స్టాలిన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలలో ఏమాత్రం తప్పులేదని తెలిపారు. సనాతన ధర్మంపై ఉదయనిది స్టాలిన్ చాలా స్పష్టంగా మాట్లాడారనీ, ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలను తెలియజేసినందుకు తాను అభినందిస్తున్నానని తెలియజేశారు. మంత్రిగా ఉదయనిధి కార్యచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నాను అంటూ సత్యరాజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఉదయినిది స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదంగా మారినప్పటికీ ఆయన మాత్రం తన మాటలను వెనక్కి తీసుకోవడం లేదు అలాగే ఎవరికీ క్షమాపణలు కూడా చెప్పనని తాను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా సరైనవేనని ఉదయనిది స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ తండ్రి స్టాలిన్ సైతం స్పందిస్తూ తన కుమారుడికి మద్దతు తెలిపారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!