Sharwanand , Rakshita: ఘనంగా జరిగిన శర్వానంద్ వివాహం.. ఫోటోలు వైరల్.!

  • June 5, 2023 / 01:24 AM IST

మొన్నటి వరకు యంగ్ హీరోగా పిలవబడుతూ వచ్చిన శర్వానంద్.. నిన్న పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయిపోయాడు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నాడు శర్వానంద్. రక్షిత.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, శ్రీకాళహస్తి నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి.. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అల్లుడు .

ఆ విధంగా రక్షిత రెడ్డి.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అవుతుంది. ఇక శర్వానంద్ – రక్షిత రెడ్డి ల నిశ్చితార్థ వేడుక జనవరి 26న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాంచరణ్ – ఉపాసన, సిద్దార్థ్ – అదితి రావు హైదరి… వంటి వారు కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఇక నిన్న అంటే జూన్ 3న శర్వానంద్- రక్షిత ల వివాహం జైపూర్లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ పిక్స్ ఓ రేంజ్ లో జరిగాయి.

ఇప్పుడు పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్..శర్వానంద్ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో శర్వానంద్ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus