Sivaji Raja: ఇప్పుడు ఆ స్టార్ హీరో పిలిచి అవకాశం ఇచ్చిన నేను నటించను

శివాజీ రాజా ఈ పేరు వినగానే చాలామందికి అమృతం సీరియల్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ సీరియల్ ఎంతలా పాపులారిటీ దక్కించుకుంది అంటే శివాజీ రాజాకి కూడా ఈ సీరియల్ తో మంచి పేరు లభించింది. ఇకపోతే ఒకప్పుడు సినిమాలలో హీరోగా నటించి ఆ తర్వాత కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసి మరింత పాపులారిటీ దక్కించుకున్న శివాజీ రాజాకు అమృతం సీరియల్ మరింత పేరును అందించింది అని చెప్పవచ్చు.

తన (Sivaji Raja) కెరియర్ లో కొన్ని వందల చిత్రాలలో నటించిన ఆయన మొదటి నుంచి చిరంజీవి అభిమానిగా ముద్ర వేయించుకున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా ఆయనను అభిమానిస్తూ వస్తున్న శివాజీ రాజా ఇప్పటివరకు చిరంజీవి కి సంబంధించిన ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి. అంతేకాదు ఒక్క చిరంజీవితోనే కాదు చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన హీరోల సినిమాలలో కూడా శివాజీ రాజా నటించలేదని తెలిపారు. ఇదే విషయంపై శివాజీ రాజా మాట్లాడుతూ..

మొదటి నుంచి నన్ను అందరూ చిరంజీవి అభిమాని అని అనుకుంటారు. అందుకేనేమో ఆ కుటుంబం అంతా నన్ను ఆదరిస్తారు. కానీ మన వాడే కదా అని ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదు. ఆయన అభిమానిగా ఇన్ని సంవత్సరాలు ఉన్నందుకు కనీసం ఆయన సినిమాల్లో నటిస్తే నాకు తృప్తి ఉండేది కానీ ఇకపై నాలో ఆకసి ఆ తపన లేదు.. నా మనసులో చిరంజీవితో నటించాలన్న కోరిక చచ్చిపోయింది..

ఇక ఆయనే పిలిచి అవకాశం ఇచ్చినా కూడా నేను ఆయనతో నటించే ప్రసక్తే లేదు అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. ఇకపోతే తాను హీరోగా పలు చిత్రాలలో నటించానని వెల్లడించిన ఆయన నటుడు రంగనాథ్తో సినిమా చేయాలన్న కోరిక మాత్రం తీరలేదని చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇటీవల అర్జున ఫాల్గుణ అనే సినిమాలో నటించిన శివాజీ రాజా తన కెరియర్ పట్ల సంతోషంగా, సంతృప్తికరంగా ఉన్నానని వెల్లడించారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus