టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన శ్రీకాంత్ అఖండ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. వరదరాజులు పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి శ్రీకాంత్ ఆ పాత్రతో ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు. అఖండ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీకాంత్ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.
తాను కర్ణాటకలో పుట్టి పెరిగానని అక్కడే చదివానని పదో తరగతి తర్వాత తనకు సినిమాలపై ఆసక్తి ఏర్పడిందని శ్రీకాంత్ అన్నారు. తాను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని శ్రీకాంత్ తెలిపారు. పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాకు తాను ఎంపికైనట్టు వెలువడిన ప్రకటనను చూసి గోలగోల చేశానని శ్రీకాంత్ అన్నారు. కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ ఎక్కువగా వచ్చాయని బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఆ పాత్రలకు ఓకే చెప్పానని శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఊహ నటించిన మొదటి సినిమాలో తాను హీరో అని ఆ తర్వాత కలిసి నాలుగు సినిమాలు చేశామని శ్రీకాంత్ తెలిపారు. నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశానని మద్రాస్ లోని ఊహ ఇంటికి చెయిన్ కొనుక్కుని వెళ్లి దేవుని మందిరంలో ఊహను, ఊహ పేరెంట్స్ ను పిలిచి ప్రపోజ్ చేశానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఊహ అసలు పేరు ఉమా మహేశ్వరి అని తమిళంలో శివరంజని అని ఇక్కడ ఊహ అని పేరు పెట్టారని శ్రీకాంత్ తెలిపారు. మేమంతా ఊహను ఉమా అని పిలుస్తామని శ్రీకాంత్ అన్నారు. ఊహకు కూడా నేనంటే ఇష్టం కావడంతో అలా మా ప్రయాణం మొదలైందని శ్రీకాంత్ తెలిపారు.