Jr NTR, Sudeep: ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుదీప్!

జూనియర్ ఎన్టీఆర్ కు సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలో కూడా వీరాభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ టాలెంట్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సుదీప్ ఒక సందర్భంలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. టాలీవుడ్ హీరోలలో ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడని సుదీప్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కష్టపడే తీరు అందరికీ నచ్చుతుందని సుదీప్ వెల్లడించారు. ఎన్టీఆర్ అద్భుతంగా నటిస్తాడని ఎన్టీఆర్ తో కలిసి నటించడం సులభం కాదని సుదీప్ షాకింగ్ కామెంట్లు చేశారు.

భీమ్ పాత్ర కొరకు ఎన్టీఆర్ మారిన తీరు అద్భుతమని సుదీప్ వెల్లడించారు. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రతో మరో సక్సెస్ ను దక్కించుకుంటాడని సుదీప్ చెప్పుకొచ్చారు. కన్నడలో స్టార్ హీరో అయిన సుదీప్ ఎన్టీఆర్ గురించి పాజిటివ్ గా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన తర్వాత ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ లో పాల్గొనడంతో పాటు కొరటాల శివ డైరెక్షన్ లోని సినిమాలో నటించనున్నారు.

ఎవరు మీలో కోటీశ్వరులు షో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ఉక్రెయిన్ షెడ్యూల్ షూటింగ్ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus