Suhas,Brahmanandam: ట్విటర్‌లో తన సంతోషాన్ని తెలిపిన సుహాస్‌!

కొంతమంది కుహనా మేథావులు విమర్శిస్తున్నట్లుగా.. టాలీవుడ్‌లో రాణించాలి అంటే బ్యాగ్రౌండ్‌ ఉండాల్సిన అవసరం లేదు. అలా ఎలాంటి నేపథ్యం లేకుండా మంచి స్థానానికి వెళ్లినవారు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. అయితే ఈ క్రమంలో అందరూ స్టార్‌ హీరోలు కాలేరు. కానీ గొప్ప పేరు తెచ్చుకుంటారు. ప్రస్తుతం మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఉన్న నటుడు సుహాస్‌. షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించి.. నేషనల్‌ అవార్డు సాధించిన ఫిల్మ్‌లో నటించాడు సుహాస్‌. అతనికి రీసెంట్‌గా బ్రహ్మానందం కలిగిందట.

ఆనందం కలగడం మనకు తెలుసు. ఈ బ్రహ్మానందం కలగడం ఏంటి? అనుకుంటున్నారా? ఎవరైనా దీవిస్తే, ఆశీర్వదిస్తే ఆనందం కలుగుతుంది. అదే బ్రహ్మానందం ఆశీర్వదిస్తే అది బ్రహ్మానందం కలగడమే కదా. సుహాస్‌కి జరిగింది ఇదే. సుహాస్‌ రీసెంట్ సినిమా ‘కలర్ ఫోటో’కి నేషనల్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం.. సుహాస్‌ను పిలిచి మరీ అభినందించారట. అంతేకాదు స్వయంగా శుభాకాంక్షలు రాసి మరీ ఓ బుక్‌ ఇచ్చారట. దీనికి సంబంధించిన ఫొటోలను సుహాస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు.

బ్రహ్మానందంతో దిగిన ఫొటోతోపాటు, ఆయన సంతకం చేసిచ్చిన పుస్తకం ఫొటో కూడా షేర్‌ చేశాడు. దీంతో సుహాస్‌ని అభినందిస్తూ ఫ్యాన్స్‌, శ్రేయోభిలాషులు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘‘శుభమస్తు.. సుహాస్‌కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుతూ.. మీ బ్రహ్మానందం’’ అని బుక్‌ మీద ఉంది. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. యువ నటుల్ని బ్రహ్మానందం ఇలా మెచ్చుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలా తన మంచి మనసును చూపించారు బ్రహ్మీ.

ఇక ‘కలర్‌ ఫొటో’ విషయానికొస్తే.. 2020లో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అలాంటి కథ ఇప్పటికే తెలుగులో చాలాసార్లు వచ్చినా ఆ సినిమా ట్రీట్‌మెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే పట్టంకట్టారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా పురస్కారం ప్రకటించింది. ఈ సినిమాలో సుహాస్‌తోపాటు చాందినీ చౌదరి కూడా నటించింది. సందీప్‌ రాజ్‌ ఈ సినిమాకు దర్శకుడు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus