Actor Suresh: ఆఫర్లు లేవు.. 8 నెలలు ఖాళీగా ఉన్నాను.. సీనియర్ హీరో సురేష్ ఎమోషనల్ కామెంట్స్!

సీనియర్ హీరో సురేష్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు అనేక ప్రేమ కథలు, కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నాడు. అయితే ఇటీవల ఇతను ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను పడ్డ స్ట్రగుల్ గురించి చెప్పుకొచ్చాడు. ఇతని తండ్రి చేసిన అప్పుల వల్ల నచ్చని సినిమాలు చేయాల్సి వచ్చింది అన్నట్టు తెలిపి షాకిచ్చాడు.

Actor Suresh

సురేష్ మాట్లాడుతూ.. “మా నాన్నగారు కూడా దర్శక నిర్మాతగా పనిచేశారు. ఆయన తీసిన ‘రాముడు- పరశురాముడు’ అనే సినిమా ప్లాప్ అయ్యి నష్టాలు మిగిల్చింది. దీంతో మేము అప్పుల్లో కూరుకుపోయాం. అందువల్ల నేను నచ్చని సినిమాలు చేయాల్సి వచ్చింది. అప్పట్లో నేను కోలీవుడ్లో బిజీ హీరో అయ్యాను. నా అప్పులు అన్నీ తీరి పోవడం వల్ల.. ‘నేను ప్రేమకథలు చేయకూడదు..కొత్త కథలు చేయాలి’ అని డిసైడ్ అయ్యాను. నిర్మాతలకు కూడా నేను ఆ విషయం చెప్పాను. అప్పుడు వాళ్ళు నాతో లవ్ స్టోరీస్ అయితేనే చేయగలం అని చెప్పారు.

కానీ నేను ఒప్పుకోకపోవడం వల్ల నాకు పెద్ద డ్యామేజ్ జరిగింది. ఆ టైంలో ఆల్మోస్ట్ 11 సినిమాలు వదులుకున్నాను. నేను ఇక ప్రేమ కథలు చేయననే టాక్ కూడా స్ప్రెడ్ అయిపోయింది. దీంతో నాకు ఆఫర్స్ లేవు.7.. 8 నెలల పాటు ఖాళీగా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. అలాంటి టైంలో రామనాయుడిగారు నాకు ‘పుట్టింటి పట్టుచీర’తో ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నారు. వెంటనే ‘చిన్న కోడలు’ .. ‘మామాశ్రీ’ వంటి సినిమాలు కూడా చేశాను.

అవి చాలా తక్కువ గ్యాప్ లో రిలీజ్ అయ్యి హిట్లు అవ్వడం వల్ల నాకు కలిసొచ్చింది. వీటికి ముందు తమిళంలో కూడా నేను ఒక చేయడం జరిగింది. అప్పటివరకు రూ.5 లక్షలు తీసుకునే నాకు… ఆ సినిమాకు రూ.5 వేలు మాత్రమే ఆఫర్ చేశాడు ఆ సినిమా నిర్మాత. చేసేదేమీ లేక ఓకే చెప్పాను. ఆ డబ్బులు కూడా సినిమా రిలీజ్ అయిన 3 నెలల తర్వాత ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చారు.

‘దబిడి దిబిడి’పై స్పందించిన ఊర్వశి రౌటేలా.. స్టెప్పులపై వైరల్‌ కామెంట్స్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus