టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా తనకు మాత్రమే సొంతమైన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటులలో వేణు ఒకరు. రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో కీలక పాత్రలో వేణు నటిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అలీతో సరదాగా షోలో పాల్గొన్న వేణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్వయంవరం మూవీ షూటింగ్ సమయంలో నేనేమో కొత్త నటుడినని వేణు అన్నారు. ఆ మూవీ షూట్ సమయంలోనే అలీ గారితో పరిచయం ఏర్పడిందని ఆ సినిమాలో అలీతో సహా అందరూ సీనియర్లే అని వేణు తెలిపారు.
తాను 25 సినిమాలలో నటించానని సినిమాల ద్వారా నేర్చుకున్నది తక్కువని నేర్చుకోవాల్సింది ఎక్కువని తెలుసుకున్నానని వేణు చెప్పుకొచ్చారు. రీఎంట్రీకి కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. ప్రత్యేక గుర్తింపు ఉన్న పాత్రలు చేయాలని కోరిక ఉండేదని ఆ కోరిక రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తీరిందని ఆయన తెలిపారు. నేను కాకినాడలో పుట్టానని మధురైలో పెరిగానని నా లైఫ్ అంతా ప్రయాణాలే అని మా నాన్నగారు ప్రొఫెసర్ కావడమే అందుకు కారణమని వేణు తెలిపారు.
భారతీరాజా డైరెక్షన్ లో ఒక సినిమా మిస్ అయ్యానని వేణు చెప్పుకొచ్చారు. నిజానికి ఆ సినిమానే తొలి సినిమా కావాలని వేణు కామెంట్లు చేశారు. ఒక షెడ్యూల్ షూట్ పూర్తైన తర్వాత సినిమా ఆగిపోయిందని భారతీ రాజా గారు చెప్పారని వేణు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో భారతీరాజా గారిని కలవగా వేరే కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని చెప్పారని వేణు కామెంట్లు చేశారు.
భారతీరాజా గారు నన్ను ఓదార్చి 500 రూపాయలు నా చేతిలో పెట్టి ధైర్యం చెప్పి వెళ్లిపోయారని వేణు చెప్పుకొచ్చారు. భారతీరాజా లాంటి గొప్ప డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా మిస్ అయితే బాధగానే ఉంటుందని వేణు కామెంట్లు చేశారు. కుక్కలంటే ఏదో తెలియని భయం అని రామాచారి మూవీలో కుక్కతో కలిసి నటించడంతో భయం పోయిందని వేణు చెప్పుకొచ్చారు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!