Vijay: విజయ్ పై చెప్పుతో దాడి వారి పనే అంటున్న ఫ్యాన్స్?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో విజయ్ తలపతి ఒకరు. ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఇటీవల ఈయన పై చెప్పుతో దాడి జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఇలాంటి స్టార్ హీరో పై ఇలాంటి ఘటన జరగడం ఏంటి అసలేం జరిగింది అనే విషయానికి వస్తే గురువారం ఉదయం కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విజయ్ కాంత్ మరణించిన సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి విజయ్ కాంత్ గురువారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విజయ్ కాంత్ మరణం పై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా పలువురు స్టార్ హీరోలు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయ్ కాంత్ చివరి చూపు కోసం తరలివస్తున్నారు ఈ క్రమంలోనే హీరో విజయ్ సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చారు. ఇక విజయ్ అక్కడికి రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు గుంపుగా చుట్టుముట్టారు విజయ్ కెప్టెన్ విజయ్ కాంత్ కు నివాళులు అర్పించి తిరిగి వెళుతూ ఉండగ అభిమానులు చుట్టుముట్టారు

ఈ సమయంలోనే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై చెప్పు విసిరారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ చెప్పు విజయ్ వెనుక భాగం తగిలిందని తెలుస్తుంది దీంతో ఆయన వెనక్కి కూడా తిరిగి చూడకుండా కారులోకి వెళ్లి కూర్చోగా కొంతమంది అభిమానులు చెప్పు తీసి వెనక్కి విసిరారు. ఈ విధంగా తమ అభిమాన హీరో పై చెప్పుతో దాడి జరిగింది అనే విషయం తెలిసి ఒక్కసారిగా విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఖచ్చితంగా ఈ దాడి (Vijay) అజిత్ ఫాన్స్ చేసి ఉంటారు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్ ఫాన్స్ వర్సెస్ అజిత్ ఫాన్స్ అన్న విధంగా వివాదాలు జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిందనే విషయం తెలియడంతో అజిత్ ఎక్స్ అకౌంటు ద్వారా ఈ ఘటనపై స్పందిస్తూ విజయ్ పట్ల ఇలా జరగడం సరైన చర్య కాదు దీనిని ఖండిస్తున్నాము అంటూ ఈయన కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus