కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయిన విజయ్ కాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డి.ఎం.డి.కె పార్టీ అధ్యక్షుడిగా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటూ వచ్చారు. కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.దీంతో సింగపూర్, అమెరికా వంటి దేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయన కుడి కాలికి ఉన్న 3 వేళ్ళను వైద్యులు తొలగించారు. ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా కాలివేళ్లకు రక్తం సరఫరా అవ్వడం లేని కారణంగా వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో ఆయన కాలి వేళ్లను తొలగించినట్టు చెప్పుకొచ్చారు.
అలాగే ఆయన లేటెస్ట్ లుక్ కు సంబంధించిన ఫోటోలు చూసి అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు విజయ్ కాంత్ ఆరోగ్యం మళ్ళీ విషమించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిన్నటి నుండి ఆయన మైయత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. అయితే ఇంకొంతమంది చెబుతూ.. విజయ్ కాంత్ గత వారం రోజుల నుండి ఇదే హాస్పిటల్లో ఉన్నారని, కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉండటంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచారని అంటున్నారు.
విజయ్ కాంత్ (Vijayakanth) వయసు ఇప్పుడు 70 ఏళ్ళు కావడంతో ఆయన అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది. కంగారు పడాల్సిన పని లేదు.. అని హాస్పిటల్ సిబ్బంది అలాగే వైద్య నిపుణులు తెలుపుతున్నారు అని, అయినా సరే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!