సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు అనిత గృహప్రవేశ వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

సీనియర్ నటుడు విజయ్ కుమార్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. అతని విలక్షణ నటనకి ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇప్పటికీ ఆయన హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ అని అంతా అంటుంటారు. ‘ప్రతిరోజు పండగే’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.ఇటీవల వచ్చిన ‘రావణాసుర’ సినిమాలో కూడా కనిపించరు. ఇక విజయ్ కుమార్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆయన మొదటి భార్య ముత్తుకన్ను గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ రెండో భార్య మంజుల అందరికీ సుపరిచితమే. ఈమె కూడా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మంజుల – విజయ్ కుమార్..లకి ముగ్గురు కుమార్తెలు. వాళ్ళే వనిత విజయ్ కుమార్, ప్రీత విజయ్ కుమార్,శ్రీదేవి విజయ్ కుమార్. అయితే విజయ్ కుమార్ (Vijaykumar) మొదటి భార్యకి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వాళ్ళే అనిత విజయ్ కుమార్, కవిత విజయ్ కుమార్. తాజాగా అనిత విజయ్ కుమార్ కొత్తింట్లోకి ప్రవేశించారు. ఈ వేడుకలో వనిత విజయ్ కుమార్ తప్ప మిగిలిన వారంతా కనిపించారు. అందరూ ట్రెడిషనల్ ఔట్ఫిట్స్ లో చక్కగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus