సీనియర్ హీరో వినోద్ కుమార్ (Vinod Kumar) అందరికీ సుపరిచితమే. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఇతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. సుమన్, భానుచందర్, వినోద్ కుమార్.. వీళ్లంతా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేసి..హిట్లు కొట్టి టాలీవుడ్లో స్థిరపడ్డారు. వినోద్ కుమార్ విషయానికి వస్తే.. ‘కర్తవ్యం’ ‘మామగారు’ ‘సీతారత్నం గారి అబ్బాయి’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. తర్వాత హీరోగా చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో తమిళ, కన్నడ సినిమాలకి పరిమితమయ్యాడు.
ఇక కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన ‘అసాధ్యుడు’ (Asadhyudu) తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చి ముఖ్య పాత్రలు పోషించడం మొదలుపెట్టిన వినోద్ కుమార్ కి.. సరైన బ్రేక్ రాలేదు. ఎన్టీఆర్ (Jr NTR) ‘శక్తి’ (Sakthi) , అనుష్క (Anushka Shetty) ‘రుద్రమదేవి’ (Rudhramadevi), నాగ చైతన్య (Naga Chaitanya) ‘యుద్ధం శరణం’ (Yuddham Sharanam) వంటి పెద్ద సినిమాల్లో చేశాడు కానీ.. అవి కూడా ఆడలేదు. అయితే ఇటీవల విడుదలైన, అంటే ఆగస్టు 15 న రిలీజ్ అయిన ‘ఆయ్’ (AAY) సినిమా మంచి సక్సెస్ సాధించింది. అందులో వినోద్ కుమార్ ‘అడబాల బూరయ్య’ పాత్రలో నటించాడు.
మొదట్లో ఇతని పాత్ర తక్కువగా కనిపిస్తుంది.బాధ్యత లేని తండ్రి పాత్ర అన్నట్టు.. కనిపిస్తుంది వినోద్ కుమార్ పాత్ర. కానీ క్లైమాక్స్ లో ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు ఈ పాత్రతో. అది బాగా పేలింది. మాస్ ఆడియన్స్ విజిల్స్ వేశారు. మరి ‘ఆయ్’ సక్సెస్ వినోద్ కుమార్ సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ ఇచ్చినట్టే..! రీ ఎంట్రీ ఇచ్చిన 18 ఏళ్ళకి అతని ఖాతాలో ఓ హిట్టు పడింది.