Sreeleela: హిందీ పుకారు సంగతి తేలలేదు.. శ్రీలీల కోలీవుడ్‌ ఛాన్స్‌ వచ్చిందా?

తెలుగు స్టార్‌లో హీరోయిన్‌ అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్‌ చేసుకున్న శ్రీలీల (Sreeleela).. ఇప్పుడు ఇతర భాషల మీద దృష్టిపెట్టిందా? అవుననే అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. టాలీవుడ్‌కి సరైన విజయం అందుకోకపోయినా.. వరుస ఛాన్స్‌లు అయితే అందుకుంది. ఏకంగా స్టార్‌ హీరోల సరసన వరుస ఛాన్స్‌లు సంపాదించింది. అయితే సినిమాల ఎంపిక విషయంలో తేడా కొట్టడంతో వరుస పరాజయాలు వచ్చాయి. అందం, డ్యాన్స్‌, నటన.. ఈ మూడు కలిపి ఒకే హీరోయిన్‌లో ఉండటం చాలా అరుదు.

Sreeleela

అలా ఉండటం వల్లే శ్రీలీల హిట్ కొట్టింది. ఇప్పుడు తన ప్రతిభను ఇతర చిత్రసీమలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో తమిళంలోకి వెళ్లడానికి రెడీ అవుతోంది. అక్కడో సినిమా చేయబోతోందట. శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan ) హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా ఉందనే విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్‌ పనులు మొదలుపెట్టారు అని చెబుతున్నారు.

ఈ సినిమాలో కార్తికేయన్‌కు జోడీగా శ్రీలీలను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీళ్లిద్దరిపై ఫొటోషూట్‌ కూడా పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శ్రీలీల హిందీలో రెండు సినిమాల విషయంలో ఓకే అయింది అని అంటున్నారు. త్వరలోనే ఆ సినిమాలు అనౌన్స్‌మెంట్‌ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఎక్కడా ఈ సినిమాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సమయంలో తమిళ సినిమా పుకారు రావడం గమనార్హం.

శ్రీలీల ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh).. నితిన్‌ (Nithin) ‘రాబిన్‌హుడ్‌’లో (Robinhood) నటిస్తోంది. ఈ రెండు కాకుండా రవితేజ 75వ సినిమా కూడా ఉంది. మరోవైపు శివ కార్తికేయన్‌ ‘అమరన్‌’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ సినిమా అయ్యాక సుధ కొంగర సినిమా ఉంటుంది అంటున్నారు. గతంలో ఇలా ఇతర పరిశ్రమలకు వెళ్లిన హీరోయిన్లు మళ్లీ ఇక్కడ సరైన సినిమాలు అందుకోలేకపోయారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus