Manchu Lakshmi, Vishwak Sen: మంచు లక్ష్మీ షోలో విశ్వక్ సేన్ హడావిడి!

  • July 29, 2021 / 11:10 AM IST

నటి మంచు లక్ష్మీ ‘ఆహా’ యాప్ కోసం ఓ షోను హోస్ట్ చేస్తోన్న సంగతి తెలియసందే. గతంలో ‘ఆహా’లో చాలా షోలు వచ్చాయి. సమంత, రానా వంటి వారు హోస్ట్ లుగా కనిపించారు. ఇప్పుడు మంచు లక్ష్మీ రంగంలోకి దిగింది. ఆహా భోజనంబూ అంటూ సెలబ్రిటీలతో రకరకాల వంటలు వండించేందుకు మంచు లక్ష్మీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్ లో విశ్వక్ సేన్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో విశ్వక్ తన ఇంట్లో వండే వంటలు, ఇంట్లో పద్దతుల గురించి చెప్పుకొచ్చాడు.

విశ్వక్ సేన్ ఇంట్లో వారంలో ఒక్క రోజే వెజ్ వండుతారట. మిగిలిన అన్ని రోజుల్లో చికెన్, మటన్, ఫిష్ అంటూ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. రోజూ మాత్రం పాయ కంపల్సరీ ఉంటుందని చెప్పాడు. మటన్ పాయ, చికెన్ పాయ ఇలా కాంబినేషన్‌లోనే ఉంటుందట. ప్రతీ రోజూ తమ ఇంట్లో నిత్యాన్నదానంలానే ఉంటుందని విశ్వక్ సేన్ చెప్పాడు. కనీసం ఇరవై మందికైనా.. అమ్మ వండి పెడుతుందని విశ్వక్ సేన్ తెలిపాడు.

ఇక షోలో వెజ్ వండిన విశ్వక్ సేన్.. మంచు లక్ష్మీను స్పెషల్ గా ఇంటికి ఆహ్వానించాడు. ఏడెనిమిది రకాల నాన్ వెజ్ ఐటమ్స్ వండి పెడతానని..అన్నాడు. మీ ఇంటి నుండి అలా రెండు లైన్లు వెనక్కి వస్తే చాలని విశ్వక్.. మంచులక్ష్మీతో అనగా.. దానికి ఆమె అయితే సైకిల్ మీద వస్తాను.. వెళ్లేప్పుడు కాస్త ఎక్సర్ సైజ్ చేసినట్లు అవుతుందని కామెంట్ చేసింది. ‘మా ఇంటికి వచ్చాక వెళ్లడం ఉండదు.. తినడంతో అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని’ విశ్వక్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus