సీనియర్ నటుడు రావి కొండలరావు మృతి
- July 28, 2020 / 06:51 PM ISTByFilmy Focus
2020 సంవత్సరం చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఇప్పటికే ఈ ఏడాది అనేక దుర్వార్తలను మోసుకు వచ్చింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో అనేక విషాద ఘటనలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. కాగా టాలీవుడ్ లో నేడు మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రావి కొండలరావు గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు సోమాజిగూడ నందుగల వివేకా నంద హాస్పిటల్ కి తరలించారు.
వయోభారంతో ఇబ్బందిపడుతున్న కొండలరావుని వైద్యులు కాపాడలేక పోయారు . రావి కొండలరావు వయసు ప్రస్తుతం 88 ఏళ్ళు అని తెలుస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలు చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన కొండల రావు 600లకు పైగా సినిమాల్లో నటించారు. ఇటీవల కాలంలో కొండలరావు 365 డేస్, ఓయ్, వరుడు, కింగ్ వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. రావి కొండలరావు భార్య రాధా కుమారి కూడా నటి కావడం విశేషం. అనేక చిత్రాలలో ఈ దంపతులు కలిసి భార్యాభర్తలుగా నటించడం జరిగింది.

రాధా కుమారి 2012 లో మరణించడం జరిగింది. కమెడియన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రావి కొండల రావు ఎక్కువగా నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా ఆయన చేయడం జరిగింది. 1991 లో బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమాలో రావి కొండలరావు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. రేపు రావి కొండల రావు అంత్యక్రియలు జరగనున్నాయి.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?











