ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్.. ఆయన భార్య రాధికలకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు చెన్నై స్పెషల్ కోర్టు బుధవారం నాడు వెలువరించిన తీర్పు కోలీవుడ్ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. లిస్టిన్ స్టీఫెన్ అనే మరో నిర్మాతతో కలిసి శరత్ కుమార్, రాధికలు కలిసి పలు సినిమాలను రూపొందించారు. ఈ క్రమంలో 2014లో ఓ సినిమా నిర్మాణం కోసం రేడియన్స్ గ్రూప్ అనే కంపెనీ నుండి అప్పుగా రెండు కోట్ల రూపాయలను తీసుకున్నారు.
ఆ తరువాత 2017లో ఈ డబ్బు చెల్లించమని రేడియన్స్ గ్రూప్ సంస్థ రాధిక, శరత్ కుమార్ లను కోరగా.. వారు ఆ డబ్బుని చెక్ రూపంలో చెల్లించారు. అయితే ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో సదరు సంస్థ చెన్నలోని సైదాపేట ప్రత్యేక కోర్టులో రాధిక, శరత్ కుమార్ దంపతులపై కేసు నమోదు చేసింది. 2019లో దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం శరత్ కుమార్, రాధికలతో పాటు లిస్టిన్ స్టీఫెన్ ను కూడా అరెస్ట్ చేయాలని తీర్పునిచ్చింది.
కోర్టు తీర్పుని సవాలు చేస్తూ.. ఈ జంట మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణని హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసింది. గత రెండేళ్లుగా ఈ కేసుపై విచారణ జరుగుతూనే ఉంది. ఫైనల్ గా బుధవారం ఏప్రిల్ 7న రాధిక, శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. మరి ఈ విషయంలో ఈ సెలబ్రిటీ కపుల్ ఏం చేస్తుందో చూడాలి!
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!