క్యాన్సర్‌ను జయించిన తారలు వీళ్లే

  • December 20, 2021 / 09:48 PM IST

క్యాన్సర్‌… ఇప్పుడు అంత భయంకరమైన వ్యాధి కాకపోవచ్చు. కానీ ఇబ్బంది పెట్టే దశకి ఆ వ్యక్తి చేరితే బయటకు రావడం మాత్రం చాలా కష్టం. దానికి చాలా గుండె ధైర్యం కావాలి. అలాంటి గుండె ధైర్యం చూపించి క్యాన్సర్‌ కోరల్లోంచి బయటపడ్డ సినిమా తారలు చాలామందే ఉన్నారు. నటి హంసా నందిని తాజాగా క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల ఆమె ఓ ఫొటోను,

తన సందేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తనకు కీమో థెరపీ జరుగుతోందని, త్వరలో క్యాన్సర్‌ నుండి బయటపడగలనని ఆశిస్తున్నాను అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రంగంలో క్యాన్సర్‌ సోకి… విజయవంతంగా బయటపడిన వారి గురించి చూద్దాం!

* గతంలో రొమ్ము క్యాన్సర్‌ గ్రేడ్‌-3 నుంచి కోలుకున్న హంసా నందిని… ఇప్పుడు జన్యుపరమైన క్యాన్సర్‌తో పోరాడుతోంది. దాని వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 70 శాతం ఉందని ఆమెనే తెలిపింది. లేదంటే గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 40 శాతం వరకు ఉందని చెప్పింది. అయితే నవ్వుతూ ధైర్యంగా పోరాడతానని.. సంపూర్ణ ఆరోగ్యంతో అందరి ముందుకు వస్తానంటూ హంసా నందిని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది.

* ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో క్యాన్సర్‌ బారిన పడి నటుడు అంటే సంజయ్‌ దత్‌ గుర్తొస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై చేసిన పోరాటంలో ఘనవిజయం సాధించారాయన. 61 ఏళ్ల వయసులో ఆయన క్యాన్సర్‌తో పోరాడిన తీరు ఎందరికో స్ఫూర్తి నింపింది. సంజయ్‌ దీని కోసం కొన్నాళ్లు నటనకు బ్రేక్‌ ఇచ్చి.. విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకొని కోలుకున్నారు.

* కంటికి కనపడని నొప్పిని పంటిబిగువున భరిచింది సోనాలీ బింద్రే. సానుకూల దృక్పథంతో ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించొచ్చు అనేలా సోనాలి మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను జయించింది. కీమోథెరపీల వల్ల జుట్టు కోల్పోయినప్పటికీ… ఆత్మవిశ్వాసాన్ని వదలలేదు. కుటుంబం, స్నేహితులిచ్చిన ధైర్యంతో సోనాలీ బింద్రే వ్యాధిపై పోరాటం చేశారు. విజేతగా నిలిచారు.

* 2012లో అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు మనీషా కొయిరాలా. మూడేళ్ల చికిత్సతో 2015లో క్యాన్సర్‌ను జయించారు. క్యాన్సర్‌తో ఆమె చేసిన పోరాటాన్ని ‘‘హీల్డ్: హౌ క్యాన్సర్‌ గేవ్‌ మీ ఏ న్యూ లైఫ్‌’’ అనే పుస్తకంలో రాశారు. దాంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే ప్రయత్నం కూడా చేశారు.

అంతకుముందు ఇలా క్యాన్సర్‌ బారినపడి కోలుకున్నవారిలో నటి మమతా మోహన్‌దాస్‌, లీసారే ఉన్నారు. వీళ్లు కాకుండా హృతిక్‌ రోషన్‌ తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ కూడా ఉన్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus