Amani: ఆడిషన్ కి వెళ్తే ఇలాంటి మాటలు మాట్లాడే వారు!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి ఆమని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్గా ఒకానొక సమయంలో స్టార్ హీరోలందరి సినిమాలలో నటించినటువంటి ఈమె తాజాగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. పలు సందర్భాలలో ఈ విషయం గురించి ఎంతోమంది సెలబ్రిటీలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని ఈమె తెలియజేశారు. సినిమా అవకాశాల కోసం నేను ఫోటోలను పంపగా వారు ఆడిషన్స్ కి రమ్మని చెప్పేవారు ఆడిషన్ కి వెళ్తే ఈ అమ్మాయా రంగు తక్కువగా ఉంది అంటూ హేళనగా మాట్లాడేవారని మరికొన్నిసార్లు మరి ఫోన్ చేస్తామని చెప్పి ఫోన్లు చేయకుండా ఉండేవారని తెలిపారు.

ఇక సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వెళ్లిన తర్వాత కూడా కొంతమంది దర్శక నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చి బోల్డ్ సన్నివేశాలలో నటించమని చెప్పేవారు అంతేకాకుండా ఈ సన్నివేశంలో చేయాలి అంటే మీ శరీరంపై ఎలాంటి స్ట్రెచ్ మార్క్స్ ఉండకూడదని? ఏమైనా ఉన్నాయా చూడనివ్వండి అంటూ చాలా ఘోరంగా మాట్లాడేవారు అంటూ ఈ సందర్భంగా ఆమని తెలిపారు.

ఇలా తన విషయంలో కూడా కొంతమంది ఇలాగే ప్రవర్తించారని అయితే తాను మాత్రం అలాంటి సినిమాల నుంచి తప్పుకున్నానని ఈమె తెలిపారు. ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈ సందర్భంగా ఆమని (Aamani) మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus