ప్రముఖ దక్షిణాది నటి అభినయ వివాహ బంధంలో అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన వి.కార్తిక్ అలియాస్ సన్నీ వర్మతో ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్‌లో అభినయ – కార్తిక్ పెళ్లి వేడుకగా జరిగింది. సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.