Amala,Sharwanand: నటుడు శర్వానంద్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన అమల!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అమల ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అమల నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం ఈమె పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమై కుటుంబ బాధ్యతలను అలాగే పలు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇకపోతే చాలా కాలం తర్వాత మనం సినిమాలో తలుక్కుమన్న అమల అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తల్లి పాత్రలో నటించి మెప్పించారు.

ఇకపోతే ఈమె తాజాగా కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం అనే సినిమాలో మరోసారి శర్వానంద్ తల్లి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ మొదటి సినిమాగా తెరికెక్కిన ఈ సినిమాలో శర్వానంద్, రీతు వర్మ జంటగా నటించారు. ఇక ఇందులో శర్వానంద్ తల్లి పాత్రలో అమల సందడి చేయనున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అమల మాట్లాడుతూ… ఒకే ఒక జీవితం ఒక ఎమోషనల్ సినిమా అంటూ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుందని ఎంతో గొప్ప చిత్రాన్ని శ్రీ కార్తిక్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని ఈ సందర్భంగా అమల ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్రతో తాను బాగా కనెక్ట్ అయిపోయానని, ఈ సినిమా వల్ల నాకు మూడో కొడుకు దొరికాడు అంటూ ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేశారో. ఎంతో అద్భుతమైన కథను శ్రీ కార్తిక్ చాలా అందంగా తీశారని ఈ సినిమాని ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్లి చూడండి అంటూ ఈ సందర్భంగా అమలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus